గోవా డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు ఎడ్విన్ విడుదల

గోవా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు ఎడ్విన్ బెయిల్ పై విడుదలయ్యాడు.హైదరాబాదులోని చంచల్ గూడా జైలు నుంచి ఎడ్విన్ బెయిల్ పై విడుదల అయినట్లు సమాచారం.

 Goa Drug Case Prime Accused Edwin Released-TeluguStop.com

కాగా డ్రగ్స్ కేసులో ఈ నెల 5వ తేదీన ఎడ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.గోవాలో నెలరోజుల పాటు గాలించిన తెలంగాణ పోలీసులు ఎడ్విన్ ను అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ కు తీసుకొచ్చి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.మత్తు మాఫియా మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేసి పది రోజులు కూడా గడవక ముందే బెయిల్ పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube