పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు చిత్రసీమలో తిరుగులేని హీరో.ఇప్పటికి ఫ్యాన్స్ లో ఏ తెలుగు హీరో కూడ ఈయనకు దరిదాపుల్లో లేరు.
సినిమా ఎలా వున్నా మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో నిర్మాతలకు నమ్మకమైన హీరో ఆయన.కేరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి.అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించలేకపోతున్నాడు.గతంలో జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్తిగా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు.
అప్పట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న పవన్ ఆయన తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
తాజాగా పవన్ ఆచరణ సాధ్యంగాని ఒక విషయాన్ని టచ్ చేశాడు.
తాను ముఖ్యమంత్రిగా గెలిస్తే రీకాల్ ను తీసుకొచ్చి ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలించే ఎమ్మెల్యేల పదవులు వెనక్కి రప్పిస్తానని హామీ ఇచ్చాడు.అయితే పవన్ చెప్పిన ఈ మాట ఎప్పటికి ఆచరణ సాధ్యం కాదు అని సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి.
అధికార పార్టీ నేతలు మాత్రం పవన్ రాజకీయ అవివేకానికి ఇదే నిదర్శనం అని బహిరంగగానే విమర్శిస్తున్నారు.పవన్ ఇలాంటి తెలివితక్కువ మనిషి కాబట్టే ప్రజలు రెండు చోట్ల ఓడించారని అంటున్నారు.
ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ రీకాల్ అమలు కాలేదు.ఒక నాయకుడు ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తుంటే మెజార్టీ ప్రజలు ఆ నాయకుణ్ణి రీకాల్ చేయాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారు.
ప్రజల అబీష్టం మేరకు ప్రభుత్వం ఆ నాయకుడిమీద వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రజల్లో నుండి ప్రజాసమావేశాలు, అభిప్రాయ సమావేశాలు, ఫిర్యాదుల స్వీకరణ లాంటి పేర్లతో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది.ఆ తర్వాత 50 శాతం మంది ప్రజలకు బ్యాలెట్ ఓటింగ్ పెడుతుంది.50 మంది లో ఒక్క ఓటు తగ్గినా ఆ రీకాల్ పనిచేయదు.దీనికి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం అవసరం.
ఆ తీర్మానంతో పార్లమెంట్ లో ఓటింగ్ నెగ్గాలి.ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపాలి.
ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా ఆయన చేతిలో మాత్రం రీకాలు చేసే పవర్ వుండదు.ఇంత ప్రాసెస్ వున్న రీకాల్ ను చాలా సులభంగా తాను చేసేస్తానని పవన్ చెప్పడంతో అందరు నవ్వుకుంటున్నారు.
రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ బిల్లు ఎన్నికల కమీషన్ కు చేరుతుంది.అప్పుడు ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుంది.మనలాంటి దేశంలో ఈ రీకాల్ అస్సలు సాధ్యం కాదు.ఇదంతా జరిగేపని కాదని పవన్ కు తెలీదేమో.మరీ ముఖ్యంగా ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలు కలిసి ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ కాకుండా చూస్తారు.ఇప్పటి వరకు మన దేశంలో కేవలం చర్చల వరకు మాత్రమే రీకాల్ పనిచేస్తుంది.
మొత్తానికి ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతున్న పవన్ ను అందరు ఒకలా మాట్లాడుకుంటున్నారు.