ఇంతకు ఎన్టీఆర్‌ అమెరికా వెళ్తున్నాడా? లేదా? జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికా వెళ్తున్నాడా లేదా అనేది ఇప్పుడు నందమూరి అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది.ఎన్టీఆర్ తప్ప మిగిలిన అందరూ కూడా ఆస్కార్ అవార్డు వేడుక కోసం అమెరికా కు చేరుకున్నారు.

 Is Ntr Going To America For Oscar Or Not Details, Koratala Siva, Ntr, Ntr30, Osc-TeluguStop.com

చిత్ర యూనిట్ సభ్యుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి అయినా ఎన్టీఆర్ ఇప్పటి వరకు అమెరికా వెళ్లక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్పాట్‌ లైట్‌ అవార్డు వేడుక కు ఎన్టీఆర్ ని ఆహ్వానించక పోవడం పట్ల నందమూరి అభిమానులు ఆగ్రహం తో ఉన్నారు.

అదే సమయం లో ఎన్టీఆర్ కూడా అలిగాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా ప్రమోషన్ విషయం లో ఎన్టీఆర్ ని పట్టించుకోవడం లేదని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ కి ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్లలేదు.అంతే కానీ గొడవలు కానీ అలగడం కానీ ఏమీ లేదని చెప్తున్నారు.ఈ నెల ఆరో తారీఖున ఎన్టీఆర్ అమెరికా వెళ్తాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కొందరు బలంగా వాదిస్తున్నారు.

ఆ విషయం లో క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఉండాలని ఉద్దేశం తో కూడా కాస్త ఎక్కువ సమయాన్ని ఆ సినిమా కోసం కేటాయిస్తున్నాడు.అందుకే అమెరికా కు వెళ్లలేదని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే, ఆస్కార్ అవార్డు వేడుకలు ఎన్టీఆర్ పాల్గొనాల్సిందే అని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏ ఇండియన్ సూపర్ స్టార్ కి దక్కని అద్భుతమైన అవకాశాన్ని ఎన్టీఆర్ వదులుకోవద్దని నందమూరి అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కోసం ఎన్టీఆర్  రెడీ అవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube