గుంటూరు జిల్లా ఇప్పటంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.జనసేన నేత దీక్షా శిబిరంలో పోలీసులు ప్రవేశించారు.
దీంతో రామాలయంలోకి వెళ్లిన జనసేన నాయకులు తలుపులు వేసుకున్నారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు ఆపేవరకు దీక్ష విరమించేది లేదని పార్టీ నేతలు తెలిపారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అయితే ఇప్పటంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే.







