రాజమౌళి( Rajamouli ) సీక్వెల్ ప్లానింగ్ లో మొదటిగా ఈగ ఉందని తెలుస్తుంది.ఈగ కి సీక్వెల్ గా ఈగ 2( Eega 2 ) చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు రాజమౌళి మహేష్ సినిమా పూర్తయ్యాక ఈగ 2 చేయాలని ప్లానింగ్ లో ఉన్నారట.
అయితే ఈగ సినిమా టైం లో రాజమౌళి క్రేజ్ వేరు కానీ ఇప్పుడు రాజమౌళి ఈగ 2 తీస్తే అది హాలీవుడ్ రేంజ్ లో ఉండాల్సిందే.అందుకే రాజమౌళి ఈగ 2 లో కాస్ట్ ఎవరెవరు ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఈగ సినిమాలో నాని, సమంత నటించారు.అయితే ఈగ 2 తీస్తే వీరిద్దరు ఆ సినిమాలో ఉండే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.సమంత తన పంథాలో తాను సినిమాలు చేస్తూ వెళ్తుంది.ఒకప్పుడు ఉన్న ఫ్యాన్ బేస్ ఆమెకి ఇప్పుడు లేదని తెలుస్తుంది.ఇక నాని ( Nani ) కూడా తన మార్క్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు.ఈగ 2 చేస్తే నాని, సమంతని ( Samantha ) పెడతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న.
అయితే ఈగ 2 చేస్తే మాత్రం అది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ మొదట్లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
మహేష్ తో రాజమౌళి సినిమా ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కి మార్గం సుగుమం చేస్తున్నారని చెప్పొచ్చు.