ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తన తండ్రిని ఏమాత్రం అనుసరించకుండా,తన సొంత పంథాలో వెళ్తూ హిట్లు , ఇండస్ట్రీ హిట్లు , బ్లాక్ బూస్టర్లు కొట్టుకుంటూ పోయాడు.ముఖ్యంగా మాస్ అనే పదానికి బొద్దు కోసి పేరు పెట్టింది ఆయనని చూసే అనే డైలాగ్ బాలయ్య బాబు కి కరెక్ట్ గా సరిపోతుంది.
వారసత్వం గా ఎన్టీఆర్ ( NTR ) నుండి ఫ్యాన్ బేస్ బాలకృష్ణ కి వచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు కానీ, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మాత్రం బాలయ్య తన సొంతం గానే తెచ్చుకున్నాడు.ఆయనకీ పడిన హిట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి మరి.అయితే బాలయ్య బాబు కి హీరో గా తిరుగులేని బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన మొట్టమొదటి దర్శకుడు కోదండ రామి రెడ్డి. ఈయన మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఎన్నో సంచనాలనాత్మక చిత్రాలను అందించాడు.

అయితే ఆరోజుల్లో బాలయ్య బాబు మరియు కోదండ రామి రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’( Mangamma Gari Manavadu ) అనే చిత్రం అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.‘దంచవే మేనత్త కూతురా’ లాంటి ఫేమస్ సాంగ్ ఈ సినిమాలో నుండి వచ్చిందే.తరతరాలు గడుస్తున్నా కూడా ఆ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది.బాలయ్య బాబు తొలిసారి బాలనటుడిగా వెండితెర మీద కనిపించిన చిత్రం తాతమ్మ కల.ఈ చిత్రం లో ఆయన భానుమతి లాంటి లెజండరీ ఆర్టిస్టుతో కలిసి నటించాడు.మళ్ళీ ఆమె తోనే ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రం లో నటించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకొని స్టార్ హీరో గా స్థిరపడిపోయాడు.
ఆరోజుల్లో ఈ చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి కేవలం లక్ష రూపాయిల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.

ఆరోజుల్లో లక్ష రూపాయిల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో ఈ సినిమాకి ఫుల్ రన్ లో నాలుగు కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.లక్ష రూపాయిలు ఎక్కడ, నాలుగు కోట్ల 80 లక్షలు ఎక్కడ.
జాక్పాట్ అంటే ఇదే,ఈ సినిమా తర్వాత గోపాల్ రెడ్డి ఎన్నో చిత్రాలను నిర్మించాడు కానీ, ఇలాంటి జాక్పాట్ మాత్రం ఎప్పుడూ దొరకలేదు.అత్యధిక సెంటర్స్ లో అర్థ శత దినోత్సవం మరియు శత దినోత్సవం జరుపుకున్న ఈ సినిమా, కొన్ని సెంటర్స్ లో సంవత్సరం రోజులకు పైగా ఆడిన దాఖలాలు ఉన్నాయి.







