ఇంతకు ఆమెతో చైతూ రిలేషన్ లో ఉన్నట్లా? లేనట్లా? ఆ సాక్ష్యాలకు వీరి సమాధానం ఏంటో?

నాలుగు ఐదు సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య మరియు సమంత చాలా తక్కువ సమయానికే విడి పోయారు.ఇద్దరు విడాకులు తీసుకుని, అధికారికంగా ఎవరి దారి వారు చూసుకున్నారు.

 Is Naga Chaitanya And Shobhitha In Relationship Or Not Details, Akkineni Fans, N-TeluguStop.com

విడాకుల తర్వాత నాగ చైతన్య కెరీర్ లో బిజీ అవ్వగా.సమంత కాస్త వెనుకబడిపోతుందని అంతా భావించారు.

కానీ ఆమె కెరియర్ మరింత స్పీడ్ గా దూసుకు పోతుంది.సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత మరో పెళ్లి విషయం లో ఆసక్తి కనబర్చుతున్నట్లుగా లేదు.

అయితే నాగ చైతన్య( Naga Chaitanya ) మాత్రం కొత్త రిలేషన్షిప్ మొదలు పెట్టాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఆ విషయమై కొన్ని సాక్షాధారాలు కూడా వెలుగు చూశాయి.

ఇటీవల లండన్ లో నాగచైతన్య ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన సమయంలో అక్కడికి స్టాఫ్ తో చైతూ ఫోటో దిగారు.

Telugu Akkineni Fans, Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Samantha, Samant

ఆ ఫోటోలో శోభిత ధూళిపాల( Shobita Dhulipalla ) ఉండడంతో ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని పుకార్లకు బలం చేకూరినట్లు అయిందని ప్రచారం జరుగుతుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఖచ్చితంగా నాగ చైతన్య త్వరలోనే తన రిలేషన్షిప్ గురించి అధికారికంగా బయటపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీలో కొందరు మాట్లాడుకుంటున్నారు.అక్కినేని ఫ్యామిలీ లో( Akkineni Family ) విడాకులు మరియు రెండవ పెళ్లి కొత్తేం కాదు.

కనుక నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోవడం ఎవరు అడ్డు చెప్పరు.అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.తాము రిలేషన్ లో ఉన్నాం అని చెప్పేందుకు వారు ఆసక్తి చూపించడం లేదు.ఇటీవల శోభిత దూళిపాల మీడియా తో మాట్లాడుతూ పుకార్లకు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Telugu Akkineni Fans, Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Samantha, Samant

అదే సమయం లో తాను ప్రేమ లో పడితే తప్పకుండా అందరికీ చెప్తానని కూడా పేర్కొంది.ఆమె మాటలను బట్టి ప్రేమలో పడలేదని అనిపిస్తుంది.ఈ ఫోటో ఏంటి అనేది మాత్రం వినండి సమాధానం రావాల్సి ఉంది.స్నేహం కారణంగా లండన్ వరకు వెళ్లిందా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే కొందరు వీరి రిలేషన్‌ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం నాగచైతన్య ప్రియురాలి హోదాలో మాత్రమే ఆమె వెళ్లి ఉంటుంది అంటూ చర్చించుకుంటున్నారు.

మొత్తానికి నాగచైతన్య ఆమెతో రిలేషన్ లో ఉన్నాడా లేదా అనే విషయాన్ని క్లారిటీ రావాల్సి ఉంది.మరో వైపు నాగచైతన్య కస్టడీ సినిమాతో ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube