ప్రతీ ఏడాది టాలీవుడ్ లో సంక్రాంతి వార్ ( Pongal Race ) జరుగుతూనే ఉంటుంది.స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ఇక 2024 సంక్రాంతి ( 2024 Sankranthi ) ఫైట్ కోసం ఇప్పటి నుండే వార్ మొదలయ్యింది.
వచ్చే ఏడాది పండుగకు బిగ్గెస్ట్ క్లాష్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.ఈసారి స్టార్ హీరోల త్రిముఖ పోరు ఉంటుంది అని గట్టిగ టాక్ వినిపిస్తుంది.లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ బజ్ ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మాస్ కమర్షియల్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్” ( Ustaad Bhagat Singh ) కూడా 2024 పొంగల్ రేస్ లోనే నిలవబోతుంది అని టాక్.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్నాడు.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ లో షూట్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి పొంగల్ రేస్ లో తేవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇదే నిజమైతే ఈసారి స్టార్ హీరోల త్రిముఖ పోరు తప్పేలా లేదు.

ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలు తమ పొంగల్ బెర్త్ లను ఖాయం చేసుకున్నారు.ముందుగా 2024 సంక్రాంతి సీజన్ లో స్లాట్ ను రిజర్వ్ చేసుకుంది మాత్రం ప్రభాస్ (Prabhas) అనే చెప్పాలి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే ( Project K ) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.మరి పవన్ కూడా వస్తే బాక్సాఫీస్ వన్ బిగ్గెస్ట్ క్లాష్ తప్పదు.







