అల్లుడితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. నిజమేనా..?

అవును.ప్రస్తుతం ఇదే న్యూస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

తాజాగా మేడ్చల్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) చేసిన కామెంట్లు రాజకీయాల్లో దుమారం సృష్టించాయి.విషయంలోకి వెళ్తే.

ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక్కొక్కరి చిట్టాలు బయటపెడుతున్నారు.అలా మంత్రి మల్లారెడ్డి 47 ఎకరాలు భూ కబ్జా చేశారు అని ఒక ఆరోపణ వినిపించింది.

అయితే ఈ ఆరోపణ ఆయనపై వినిపించగానే మల్లారెడ్డి భయపడ్డాడో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి తన నిర్ణయాన్ని మార్చుకొని బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్లోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తొడలు కొట్టి సవాళ్లు చేసి ఎంతో అసభ్య పదజాలం రేవంత్ రెడ్డి ( Revanth reddy ) విషయంలో ఉపయోగించిన మల్లారెడ్డి సడన్గా మాట మార్చరు.

Advertisement

రేవంత్ నాకు మంచి స్నేహితుడు అంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.

అంతేకాకుండా అసెంబ్లీ అయిపోయాక తన అల్లుడితో కలిసి మల్లారెడ్డి చాలా సైలెంట్ గా రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.అయితే అక్కడే అసెంబ్లీ లాబీలో తీన్మార్ మల్లన్న ( Teenmar Mallanna ) మల్లారెడ్డికి ఎదురయ్యారు.ఇక ఈ మధ్యనే కాంగ్రెస్లో చేరిన మల్లన్న మేడ్చల్ సీటు ఆశించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్నకి సీటు కేటాయించలేదు.

అయితే వీరిద్దరూ ఆ సీటు గురించి మాట్లాడుకున్నాక సడన్ గా తీన్మార్ మల్లన్న మీరు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారా అని అడిగితే అసెంబ్లీలో కాంగ్రెస్ కి సీట్లు తక్కువగా ఉంటే కచ్చితంగా నా మద్దతు కాంగ్రెస్ కే ఇస్తాను అంటూ మల్లారెడ్డి మాట్లాడడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.

అంతేకాకుండా ఎన్నికల సమయంలోనే పార్టీలు, రాజకీయాలు అనేవి ఉంటాయి.ఎన్నికలు అయిపోయాక ఇలాంటి రాజకీయాలు ఉండవు అని మల్లారెడ్డి మాట్లాడడం అలాగే సొంత పార్టీకి కాకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తానని మాట్లాడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.అంతేకాదు త్వరలోనే మల్లారెడ్డి తన అల్లుడితో కలిసి బీఆర్ఎస్ (BRS) ని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

అయితే తనపై ఎలాంటి కేసు ఉండకుండా తాను చేసిన భూకబ్జాలు ఇతరత్రా ఏది బయటపడకుండా ఉండాలంటే కాంగ్రెస్ తో దోస్తీ చేయడమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నారని,అందుకే కాంగ్రెస్ (Congress) కి మద్దతు తెలుపుతున్నారని ఈ విషయం తెలిసిన వాళ్లు మాట్లాడుకుంటున్నారు.మరి చూడాలి మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారా లేదా అనేది.

Advertisement

తాజా వార్తలు