బెట్టింగ్ మాఫియా కోసమే లగడపాటి అలా చెప్పాడా ..?

నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదురోయ్ ! అన్నట్టుగా లగడపాటి రాజగోపాల్ తెలంగాణాలో పోలింగ్ అనంతరం మాట్లాడాడు.అనేక జాతీయ మీడియా సంస్థలు… పేరు మోసిన సర్వే సంస్థలు తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారంటూ… ప్రకటించగా… అబ్బే అది అసంభవం తెలంగాణాలో కూటమే అధికారంలోకి రాబోతోంది.

 Is Lagadapati Survey Only For Betting Mafia-TeluguStop.com

అంతే కాదు పదిమంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారు అంటూ లగడపాటి సంచలన ప్రకటన చేసి అందరిని ఆలోచనలో పడేసాడు.ఇక అప్పటి నుంచి ప్రజల్లోనూ… రాజకీయ పార్టీల్లోనూ ఒకటే గందరగోళం నెలకొంది.

అసలు ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియక తికమకపడ్డారు.కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం లగడపాటి చెప్పినదానికి భిన్నంగా వచ్చాయి.

దీంతో అందరికి లగడపాటి మీద అనుమానాలు మొదలయ్యాయి.

లగడపాటి సర్వేలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని తెలిసినా.ప్రజాకూటమికి ధైర్యం ఇచ్చేందుకే ఆయన తప్పుగా చెప్పారని కొందరు అంటున్నారు.చంద్రబాబు వెనుక ఉండి ఆడించిన నాటమని చెబుతున్నారు.

ఏపీలో రాజ్యసభ సీటు కోసమే లగడపాటి ఈ విధంగా వ్యవహరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరీ ఇంత ఏకపక్షంగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఆరా తీయడం మొదలు పెట్టగా … ఆయన వెనుక బెట్టింగ్ మాఫియా ఉన్నట్టు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికలపై వందల కోట్లలో బెట్టింగ్ జరిగిందని.వారికి మేలు చేసేందుకే లగడపాటి ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందంటూ చెప్పాల్సి వచ్చిందని పరకాల నుంచి విజయం సాధించిన చల్లా ధర్మారెడ్డి అంటున్నారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేకుండా … విజయం సాధిస్తుంది అంటే గెలుపోటములపై బెట్టింగులు కాసేందుకు ఎవరూ ముందుకురారని…అందుకే అన్ని సర్వే సంస్థలు ఒకవిధంగా చెప్తే లగడపాటి వేరే విధంగా చెప్పి ఉత్కంఠ పెంచాడని ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు ఆంధ్రా నుంచి చాలామంది ఫోన్‌ చేసి మీరు ఓడిపోతారని పందెం కాశామని పరిస్థితి ఎలా ఉందని అడిగారని.వారికి తాను తప్పకుండా గెలుస్తున్నా.మీ బెట్టింగ్ పైసల్ వాపస్ తీసుకోమని సలహా ఇచ్చానని ధర్మారెడ్డి చెప్పారు.ఆయన మాటలను బట్టి చూస్తుంటే దీని వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు అర్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube