కేటీఆర్‌ ఫొటోకు మంచు మనోజ్‌ కామెంట్‌... వైరల్‌ అయిన మనోజ్‌ ట్వీట్‌

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జయకేతనం ఎగుర వేసింది.ఈ సందర్బంగా సినీ ప్రముఖులు పలువురు అభినందనలు తెలుపుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

ఎన్నికల ఫలితాల సరళి ప్రారంభం అవ్వగానే టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబర్చుతూ వచ్చింది.దాంతో కౌంటింగ్‌ ప్రారంభం అయిన కొద్ది సమయానికే కేటీఆర్‌ గన్‌తో షూట్‌ చేస్తున్న ఒక ఫొటోను షేర్‌ చేశాడు.

ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ఆ ఫొటో తెగ వైరల్‌ అయ్యింది.దానికి పలువురు పలు రకాల కామెంట్స్‌ చేశారు.

కేటీఆర్‌ గన్‌ షూట్‌ పిక్‌ను రీ ట్వీట్‌ చేసిన మంచు మనోజ్‌ విభిన్నమైన తరహాలో కామెంట్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు… సోషల్‌మీడియాలో మంచు మనోజ్‌ స్పందిస్తూ… ఒక బుల్లెట్‌తో అంత మందిని ఎలా సాధ్యం అయ్యింది అన్న.నీ గురి సూపర్‌, మీరు ఈ విజయానికి పూర్తిగా అర్హులు.

మిమ్ములను రాష్ట్ర ప్రజలు పూర్తి నమ్మకంతో విజేతలుగా చేశారు.ఈ విజయం మీపై మరింత బాధ్యత పెంచుతుంది.

మీరు రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేస్తారనే నమ్మకం ఉంది.తప్పకుండా మీరు ఈ విజయంతో రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని భావిస్తున్నాను.

పార్టీకి మీకు హార్థిక శుభాకాంక్షలు అంటూ పోస్ట్‌ చేశాడు.

మంచు మనోజ్‌తో పాటు ఇంకా ఎంతో మంది కూడా కేటీఆర్‌ ఫొటోకు కామెంట్స్‌ రాశారు.కేఈఆర్‌ గన్‌ షా తప్పలేదని, ఏమాత్రం మిస్‌ కాకుండా ప్రజా కూటమికి బాక్స్‌ బద్దలయ్యేలా చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు.ఫలితాల రోజంతా కూడా కేటీఆర్‌ గన్‌ షాట్‌ టీవీల్లో కూడా తెగ వైరల్‌ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube