తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధించి ముచ్చటగా మూడవసారి అధికారం చేపట్టాలని కేసిఆర్( CM KCR )పట్టుదలగా ఉన్నారు.
అయితే ఈసారి గెలుపు విషయంలో కేసిఆర్ కాస్త సందిగ్ధంగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.దానికి కారణం ఆయన ఇటీవల చేసన వ్యాఖ్యాలే అని చెప్పవచ్చు.
బిఆర్‌ఎస్ పార్టీ( BRS part ) ఆవిర్భావ సభలో ప్రజాప్రతినిధులతో మాట్లాడినా కేసిఆర్.పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ హిట్ పెంచుతున్నాయి.
దళితబంధు ( Dalit Bandhu )వంటి పథకాలలో అర్హులకు లభ్ది చేకూర్చేందుకు కొందరు ఎమ్మేల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారని.వారికి సంబందించిన చిట్టా తన దగ్గర ఉందని కేసిఆర్ చెప్పుకొచ్చారు.

ఇకనుంచైనా సిట్టింగ్ ఎమ్మేల్యేలు జాగ్రత్త్గగా ఉండాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో అటువంటి వారికి సీటు ఇచ్చే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు.అంతే కాకుండా ఈసారి ఎన్నికలను తేలికగా ఇట్సుకోవద్దని నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని సంస్తగతంగా మరింత బలపరచాలని చెప్పుకొచ్చారు కేసిఆర్.అయితే విజయంపై కేసిఆర్ చేసిన వ్యాఖ్యలలో కాన్ఫిడెన్స్ లోపించిందనేది కొందరి అభిప్రాయం.ఎందుకంటే పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందిపై ప్రజా వ్యతిరేకత ఉంది.అది పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఇక ఇప్పటికే పదేళ్ళు కేసిఆర్ పాలనను చూసిన తెలంగాణ ప్రజలు అధికార మార్పును కూడా కోరుకునే అవకాశం ఉంది./br>

మరోవైపు వేగంగా బలపడుతున్న బీజేపీతో బిఆర్‌ఎస్ కు ముప్పు పొంచి ఉంది.ఈ నేపథ్యంలో ఈసారి బిఆర్‌ఎస్ విజయం సాధించడం అంతా తేలికైన విషయం కాదనేది రాజకీయ వాదుల అభిప్రాయం.అందుకే కేసిఆర్ లో ఏదో ఓ మూలాన ఓటమి భయం కూడా ఉందనేది వారి వాదన.అందుకే ముందస్తు ఎన్నికల విషయంలో కూడా కేసిఆర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది./br>

ఇంకా పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కూడా బహిరంగంగానే అసంతృప్తి వార్నింగ్ లు ఇస్తున్నారు.అయితే ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు మంచి ఫలితాలు ఇస్తాయో కేసిఆర్ కు బాగా తెలుసు.అందువల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలమందిని పక్కన పెట్టిన ఆశ్చర్య పోనవసరం లేదు.మొత్తానికి ఈసారి ఎన్నికలు మాత్రం కేసిఆర్ ను కొంత భయానికి గురి చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.







