'మహా కూటమి' ని టెన్షన్ లో పెట్టిన....'జేపీ'..!   Is Jayaprakash Narayana Troubling To Mahakutami     2018-10-29   11:58:57  IST  Surya

తెలంగాణలో ఎన్నికల హడావిడి మాములుగాలేదు. ఒక పక్క కూటమి పార్టీలు మరో పక్క ఒంటరి పోరు లో టీఆర్ఎస్ డీ అంటే డీ అంటున్నాయి. సరిగ్గా మరో నెల కాలమే సమయం ఉండగా ఎవరికి వారు తెలంగాణలో ఓట్ల కోసం చేయని ఫీట్లు లేవు. టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలని కాంగ్రెస్ తనవైపుకి ఆకర్షితూ టీఆర్ఎస్ కి షాక్ ఇస్తుంటే మరో పక్క టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నేతలని , టీడీపీ నేతలకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తోంది…ఇక

ప్రచార విషయంలో ఎలాంటి వ్యుహాలని అమలు చేయాలో మల్లగుల్లాలు పడుతున్నాయి ఇరు పార్టీలు.కూటమిలో ఉన్న పార్టీలకి ఎలాగో సినిమా గ్లామర్ ఉండనే ఉంది..కానీ ఒక్క టీఆర్ఎస్ పార్టీకి మాత్రం సినిమా గ్లామర్ లేదనే చెప్పాలి. కానీ టీఆర్ఎస్ పార్టీ సినిమా గ్లామర్ కంటే కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీలో కెటిఆర్ , కేసీఆర్ ,కవిత , హరీష్ రావు ఈ నలుగురు మాట్లాడితే చాలు ఎన్ని సినిమా గ్లామరస్ అయినా సరే బలాదూరే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు..ఇదిలాఉంటే తెలంగాణలో అత్యధికంగా కొన్ని నియోజక వర్గాలలో గెలుపు ఓటములు డిసైడ్ చేసేది ఆంధ్రా ఓటర్లే..v

అయితే ఆంధ్రా ఓట్ల కోసం మహా కూటమి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేనే లేదు ఎందుకంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ కి తెలంగాణలో ఆంధ్రా ఓట్లపై మంచి పట్టు ఉంది దాంతో ఈ విషయంలో వారు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక ఆంధ్రా ఓట్ల విషయంలో ఒకింత ఇబ్బంది పడేది అధికార పార్టీ టీఆర్ఎస్..ఈ క్రమంలో ఆంధ్రా ఓటర్లని ఆకర్షించడానికి టీఆర్ఎస్ అధినేత తనయుడు కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సత్ఫలితాలని ఇస్తున్నాయి..

Is Jayaprakash Narayana Troubling To Mahakutami-

తెలంగాణా రాక ముందు ఆంధ్రా సేటిలర్స్ ని తెలంగాణలో ఉండనివ్వరు వారిపై దాడులు జరుగుతాయని ఎన్నో రకాలుగా భయపెట్టిన పార్టీలకి నాలుగున్నర ఏళ్లుగా మేము అందించిన పాలనే కౌంటర్ అని కేటిఆర్ వ్యాఖ్యానించారు..అంతేకాదు తెలంగాణలో నివసించే సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటానంటూ కేటిఆర్ చేసిన వ్యాఖ్యలకి తగ్గట్టుగా లోకసత్తా అధినేత జేపీ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతాన్ని ఇచ్చాయి..తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతపై కేటీఆర్ చక్కగా మాట్లాడారని కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం సరికాదని, కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజలు గుడ్డిగా పార్టీలకు ఓటు వేయడం మంచిది కాదని హితవు పలికారు..ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు కూటమి గుండెల్లో రైళ్ళు పరిగేట్టేలా చేస్తునాయి. ఆంధ్రా ఓట్లు మావే అనుకున్న సమయంలో జేపీ ఒక్క సారిగా చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రా ఓట్ల పై తీవ్రమైన ప్రభావం తప్పకుండా చూపే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.