కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.అయితే కొన్నిరోజులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంటే జగ్గారెడ్డి కస్సుబస్సులాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తప్పిన వారిని గోడకేసి కొడతానంటూ రేవంత్ హెచ్చరించగా.గోడకేసి కొట్టడానికి నువ్వెవరు అంటూ జగ్గారెడ్డి రేవంత్‌పై ఫైరయ్యారు.
దీంతో పరోక్షంగా పార్టీలో క్రమశిక్షణ తప్పుతోంది తానే అన్న సంకేతాలను జగ్గారెడ్డి పంపించారు.అయితే ఈ పరిణామాలతో సంచలన నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన జగ్గారెడ్డి తీరా తుస్సుమనిపించారు.
తన నిర్ణయం ఇప్పుడే ఉండదని ట్విస్ట్ ఇచ్చారు.
అయితే జగ్గారెడ్డి సంచలన నిర్ణయానికి ఓ ముహూర్తం ఖరారైందని.
దసరాకు ఆయన సంచలన నిర్ణయం ఉంటుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇంతకీ ఆ సంచలన ప్రకటన ఏంటని ఆరా తీయగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో లేకపోవడమే జగ్గారెడ్డి తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది.తనకు బదులుగా తన కుమార్తె జయారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని జగ్గారెడ్డి అడగనున్నట్లు టాక్ నడుస్తోంది.
వీలైతే పార్లమెంట్ బరిలో లేకపోతే రాజకీయాల నుంచి దూరంగా జరగాలని జగారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

ఏటా సంగారెడ్డిలో జగ్గారెడ్డి దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు.ఆ వేడుకల్లో తన రాజకీయ జీవితంపై ప్రకటన చేస్తారని తాజాగా చర్చ జరుగుతోంది.మరోసారి జగ్గారెడ్డి తూచ్ అంటారో లేదా కీలక నిర్ణయం తీసుకుంటారో దసరా వరకు వేచి చూడాల్సిందే.
కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండకు, పీసీసీ కార్యవర్గ సమావేశాలకు జగ్గారెడ్డి దూరంగా ఉన్నారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు, గాంధీభవన్‌కు కూడా దూరంగా ఉండాలని జగ్గారెడ్డి నిర్ణయించారట.
దసరా వరకు ఆయన గాంధీభవన్ మెట్లు ఎక్కరట.పార్టీ అంతర్గత అంశాలపైనే కాదు.
బీజేపీ, టీఆర్ఎస్‌ల విషయాలపై కూడా మాట్లాడకూదని జగ్గారెడ్డి నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అటు జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య రగడ ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందోనని కాంగ్రెస్ నేతలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.