కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ అప్పుడే ఆ రెండు పార్టీలు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు గేలం వేసే పనిలో పడ్డాయి.ముఖ్యంగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలవబోతున్నాయి అనే రిపోర్ట్స్ వచ్చిన ప్రతి పార్టీని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ముఖ్యంగా కేంద్రంలో హంగ్ తప్పదు అనే సంకేతాలు బలంగా వస్తుండడంతో ముందు జాగ్రత్తగా అన్ని పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే 21 ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వెంట నడవడంతో కొత్త మిత్రుల కోసం బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పటి వరకు తమకు తిరుగులేని మెజార్టీ ఖాయం అని భావించిన బీజేపీకి ఎక్కడో తేడా కొడుతుందే అన్న అనుమానంతో ఉంది
ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఇస్తామని చెప్పి తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్లాన్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే దీనిపై బీజేపీ సీనియర్లు జగన్ కు రాయబారాలు పంపినట్టు తెలుస్తోంది.
కాకపోతే గతంలో టీడీపీ – బీజేపీ పొత్తు కొనసాగుతున్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు అని బీజేపీ చెప్పడం, ఆ రెండు పార్టీల మధ్య ఆ తరువాత విభేదాలు వచ్చి విడిపోవడం జరిగిపోయాయి.ఈ నేపథ్యంలోనే హోదా ఇచ్చిన వారికే తన మద్దతు అని జగన్ గతంలోనూ చెప్పారు, ఇప్పుడూ అదే చెబుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా జగన్ 20 సీట్లు గెలుస్తారనే అంచనా ఉంది.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ఆ 20 సీట్లు కీలకమవుతాయి.అందుకే జగన్ ను దగ్గర చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.
అలాగే ఒడిషాలో నవీన్ పట్నాయక్ తోనూ ఫొని తుఫాన్ సమయంలో మోడీ చర్చలు జరిపారు.ఆ రాష్ట్రానికి హోదా ఇస్తే మద్దతు ఇస్తానని నవీన్ చెప్పాడట.
తుఫాన్ లతో అతలాకుతలమైన రాష్ట్రానికి ఇదే పరిష్కారమన్నారట.జగన్ 20, నవీన్ 20 సీట్లు సాధిస్తే కేంద్రంలో తమకు వేరే మిత్రులు అవసరం లేదని బీజేపీ భావిస్తోందట.
అందుకే ఏదో ఒక రకంగా జగన్ ను తమ వైపు తిప్పుకునేందుకు ‘హోదా’ అంశాన్ని మళ్ళీ తెరమీదకు తెస్తోంది బీజేపీ.







