73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు ( Chandrababu ) రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైంది అంటూ ఇప్పటికే ఏపీలోని పలువురు నాయకులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు.ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ( Jagan mohan reddy ) సైతం ముసలాయన పెద్దాయన అంటూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఇక మంత్రి కొట్టు నారాయణ అయితే తరచూ చంద్రబాబు ముసలాయన అయిపోయాడు.ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిది.
అన్ని జబ్బులు ఉన్న ఆ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ కి అవసరమా అంటూ మాట్లాడుతూ ఉంటారు.ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల్లో టిడిపి పార్టీలో చంద్రబాబు లేకుండా ఆ పార్టీ లేదు.
మరీ ముఖ్యంగా చంద్రబాబు తర్వాత లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.దీంతో చంద్రబాబు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆయన తర్వాత టిడిపికి పెద్దదిక్కు ఎవరు అనేదాని గురించి ఆంధ్రప్రదేశ్లోని చాలామంది నేతలు చర్చించుకుంటున్నారు.
మరి టిడిపిలో చంద్రబాబు తర్వాత అంత బలమైన వ్యక్తి ఎవరు.ఒకవేళ బాలకృష్ణ ( Balakrishna ) కి ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే సత్తా ఆయనలో ఉందా.
అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు టిడిపి నాయకుల్లో తలెత్తుతున్నాయి.

ఇక 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు కి 2023 ఒక చీకటి సంవత్సరంగా మారిపోయింది.ఈ సంవత్సరంలో ఆయన దాదాపు 52 రోజులు జైలు పాలయ్యారు.ఈ సంవత్సరం ఆయన జీవితంలోనే చీకటి దినాలు అని చెప్పుకోవచ్చు.
ఇక చంద్రబాబు రాజకీయాల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తే పార్టీ అధినాయకత్వాన్ని ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు.అసలు చంద్రబాబు లేకుండా పార్టీ ముందుకు వెళ్తుందా.
అనే దాని గురించి రాజకీయ విశేషకులు కూడా చర్చించుకుంటున్నారు.

ఒకవేళ చంద్రబాబు రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెబుతారా.లేక తెర వెనుక ఉండి చక్రం తిప్పుతారా అని ఇలా ఎన్నో విధాలుగా చంద్రబాబు అలాగే టిడిపి పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు తర్వాత టిడిపి పార్టీని ముందుకు నడిపేవారు ఎవరని పార్టీ అధిష్టానం లో ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి.
మరి తండ్రి పెట్టిన పార్టీ నందమూరి బాలకృష్ణ చేతికి వస్తుందా లేదా నారా లోకేష్ ( Nara Lokesh ) పార్టీ పగ్గాలు చేపడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.