చాలా మంది ప్రజలు పొద్దున్నే కొన్ని ఉడకబెట్టిన గుడ్లను తింటుంటారు.అలాగే శక్తి రావాలని, ప్రోటీన్ తమ బాడీకి అందాలని కూడా దీనిని అధికంగా తింటారు.
ఎందుకంటే గుడ్డు అనేది పోషకాల నిలయం.అయితే ఉడక పెట్టడానికి ఎంత సమయం పడుతుందో కొందరికి దాని పుట్టు తీయడం కూడా అంతే సమయం పడుతుంది.
గుడ్డు పొట్టు తీయడం చాలా సమయంతో కూడుకున్న పనిగా దాదాపు అందరూ భావిస్తారు.అయితే ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగిస్తే ఈ పొట్టును రెండు మూడు సెకన్ల సమయంలో తీసేయొచ్చు.
ఆ సింపుల్ ట్రిక్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారింది.
ఉడకబెట్టిన గుడ్డు పొట్టంతా తీయకుండా సింపుల్‌గా ఆ పొట్టు వదిలించడాన్ని ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో ద్వారా చూపించాడు.
అందుకు ఈ వ్యక్తి ఉడికించిన గుడ్డు కింద భాగంలో ఒక పెద్ద రంధ్రం చేసాడు.పై భాగంలో మాత్రం కాస్త చిన్నగా రంధ్రం చేశాడు.పై భాగంలో కాస్త పొట్టు తీసి కింద భాగంలో పూర్తిగా పొట్టు తీసిన ఈ వ్యక్తి తన ట్రిక్ ప్రయోగించడం స్టార్ట్ చేశాడు.పై భాగంలో చిన్న రంధ్రం నుంచి అతను గట్టిగా ఊదాడు.
అంతే కింద భాగంలో నుంచి గుడ్డు బయటకు వచ్చింది.పొట్టు మాత్రం అతని చేతిలో ఉండిపోయింది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యూట్యూబ్ అఫీషియల్ హ్యాండిల్ షేర్ చేయగా దీనికి ఇప్పటికే 24000 వేలకు పైగా లైకులు లక్షలకొద్దీ వచ్చాయి.“ఈ రాత్రికి గుడ్లు ఉడకబెడుతున్నా.ఈ ట్రిక్ ప్రయోగించడం కోసమే” అని పోస్ట్‌కి ఒక క్యాప్షన్ జత చేశారు.







