సహాయక చర్యల్లో ఇంత నిర్లక్ష్యమా..? ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయాలని.బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని.

 Is It So Careless In Supportive Actions Chandrababu Is Angry With The Governme-TeluguStop.com

కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాటలు చెప్పడం తప్ప, చేసింది శూన్యం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు.గులాబ్ తుఫాను నేపథ్యంలో టీడీపీ నాయకులతో చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థంగా పని చేసి.‌ బాధితులకు అండగా నిలిచిందని, హుదూద్, తిత్లి తుఫాన్ ల సంభవించినప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి  యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని, గంటల వ్యవధిలో విద్యుత్ ను పునరుద్ధరించాలని గుర్తుచేశారు.

రైతులకు జరిగిన పంట నష్టానికి తగిన పరిహారం పెంచి అందజేశామని చెప్పారు.గులాబ్ తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర బాగా దెబ్బతిందని.

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు.

ప్రజలకు ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని దాదాపుగా మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రోడ్లు నాశనమయ్యాయని, జనజీవనం స్తంభించిందని పేర్కొన్నారు.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటున్నారనిసీఎం జగన్ మాత్రం ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నా లేకపోయినా విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.

Telugu Achhanaidu, Ap, Ap Poltics, Chandra Babu, Chndra Bbau, Gulb Tufan, Ys Jag

టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గులాబ్ తుఫాను ప్రభావంతో పంటలు ఎక్కువగా నష్టపోయాయని, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు, మండల గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube