వైసీపీని ఓడించడం కష్టమేనా ?

ఏపీ ప్రజలు మరోసారి వైసీపీకే( YCP ) పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారా ? టీడీపీ జనసేన ఎన్ని ప్రయత్నాలు చేసిన వైసీపీని ఓడించడం కష్టమేనా ? అంటే అవుననే అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.ఈసారి ఎన్నికల్లో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు కూడా కీలకమే.

 Is It Difficult To Defeat Ycp In Ap Elections 2024 Details, Ycp, Ys Jagan, Ap El-TeluguStop.com

అందుకే పార్టీల అధినేతల వ్యూహాలు గెలుపే లక్ష్యంగా ఉన్నాయి.కేవలం గెలుపు కాదు 175 స్థానాల్లో విజయమే లక్ష్యం అని జగన్( Jagan ) భావిస్తుంటే.

వైసీపీకి చెక్ పెట్టి జగన్ ను గద్దె దించాలని టీడీపీ జనసేన కూటమి భావిస్తోంది.

Telugu Ap, Chandrababu, Cmjagan, Jaganwelfare, Janasena, Pawan Kalyan, Ys Jagan-

ప్రస్తుతం ఏపీలో జగన్ పాలనపై ప్రజలు సానుకులభావంతోనే ఉన్నారనేది కొందరి అభిప్రాయం.ఎందుకంటే వాలెంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వంటి విధానాలను ప్రవేశ పెట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేశారు.పైగా ఎన్నో సంక్షేమ పథకాలు( Welfare Schemes ) ప్రవేశ పెట్టి వాటిని పారదర్శకంగా అమలు చేస్తున్నారు.

దీంతో జగన్ పాలనకు ప్రజా మద్దతు బాగానే ఉంది.జగన్ సర్కార్ పై సానుకూలత ఉంటే మరి వ్యతిరేకత ఎందుకు వ్యక్తమౌతుంది అనే సందేహాలు రాక మానవు.

జగన్ పాలనపై సానుకూలత ఉన్నప్పటికి ఆయా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలపై అలాగే మంత్రివర్గంలోని కొందరి వైఖరిపైనే అసలైన వ్యతిరేకత కనబడుతోంది.

Telugu Ap, Chandrababu, Cmjagan, Jaganwelfare, Janasena, Pawan Kalyan, Ys Jagan-

అందుకే ఈ లోపాన్ని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు.నియోజక వర్గాల వారీగా సర్వేలు చేయించి వ్యతిరేకత ఉన్న వారిని నిస్సందేహంగా పక్కన పెట్టేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను( YCP Incharges ) మార్చారు కూడా.

అలాగే సీట్ల కేటాయింపులో కూడా పూర్తిగా మార్పులు చేపడితే వైసీపీలో పూర్తి ప్రక్షాళన జరిగినట్లే.దీంతో వైసీపీకి తిరుగుండదనేది కొందరి అభిప్రాయం.ఇక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ టార్గెట్ తో ఉన్న జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక చేపడితే వైసీపీని ఓడించడం అంతా తేలికైన విషయం కాదనేది కొందరి అభిప్రాయం.మరి టీడీపీ జనసేన కూటమి( TDP Janasena ) ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube