ఏపీలో నడిచేది ప్రజాస్వామ్యమా? లేక పోలీసు రాజ్యమా- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.అమరావతి రాజధాని మార్చాలనే మంత్రులు డ్రామాలు కట్టిపెట్టి, రాజీనామాలు చేయాలి.అమరావతి పాదయాత్రపై వైసీపీ వర్గీయులు దాడులు చేయడం దుర్మార్గం.అమరావతి రైతులపై పోలీసు జులుం ప్రదర్శించడాన్ని, పాదయాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే అమరావతి రైతుల పాదయాత్ర సజావుగా సాగేలా చూడాలి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలి.
తాజా వార్తలు