మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి వరకు సినిమా యొక్క షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టడం ఖాయం గా తెలుస్తోంది.
దాంతో గతంలో అధికారికంగా చెప్పినట్లుగా ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయడం కన్ఫర్మ్ అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉంది.ఇదే సమయంలో చిరంజీవి సినిమా కూడా అదే సంక్రాంతికి వస్తుంది కదా పరిస్థితి ఏంటీ అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
ఈ సమయంలో శంకర్ సినిమా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం సినిమా వాయిదా పడిందట.రామ్ చరణ్ 15 సినిమా షూటింగ్ అనుకున్న సమయంకు పూర్తి అవ్వబోతున్నా కూడా చిరంజీవి సినిమా సంక్రాంతికి ఉండటం వల్ల చరణ్ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో అది కూడా ఆరంభంలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏప్రిల్ లో రామ్ చరణ్ శంకర్ ల కాంబో లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమా షూటింగ్ ఏపీ లో జరుగుతోంది.అతి త్వరలోనే హైదరాబాద్ కు చిత్ర యూనిట్ సభ్యులు చేరుకుంటారు.రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన విషయం తెల్సిందే.
అక్కడ నుండి వచ్చిన తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ను మొదలు పెట్టే విధంగా దర్శకుడు శంకర్ ప్లాన్ చేశాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కియారా అధ్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో మరో హీరోయిన్ గా అంజలి నటిస్తున్న విషయం తెల్సిందే.







