టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ వసూళ్లను నమోదు చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే.ప్రస్తుతం ఈ సినిమాను జపాన్ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ప్రచారం చేస్తున్నారు.
ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు ఇతర యూనిట్ సభ్యులు జపాన్ వెళ్లారు.అక్కడ మన టీమ్ కు దక్కిన ఆహ్వానంకు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒక తెలుగు సినిమాకు ఇంత భారీ క్రేజ్ ఏంట్రా బాబు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
బాహుబలి సినిమా తో రాజమౌళికి అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది.
అందుకే ఈ సినిమా ను అక్కడ విడుదల చేస్తాం అనగానే అక్కడ నుండి పెద్ద ఎత్తున స్పందన దక్కింది.తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో అయితే సినిమా వసూళ్లను దక్కించుకుందో అక్కడ కూడా తప్పకుండా భారీగానే వసూళ్లు నమోదు అవుతాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.
రాజమౌళి కి అక్కడ ఉన్న ఫాలోయింగ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలను చూస్తే అర్థం అవుతోంది.

మొదటి రెండు రోజులు పూర్తిగా సినిమా ప్రమోషన్ కి కేటాయించిన చిత్ర యూనిట్ సభ్యులు మూడవ రోజు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా చిల్ అయ్యారు.అంతే కాకుండా థియేటర్ ల్లో అక్కడి ఆడియన్స్ తో కలిసి సినిమాను చూడటంతో పాటు ా ఆ తర్వాత అక్కడి వారితో మాటా ముచ్చట కలిపారు.మూడవ రోజు కూడా జక్కన్న టీమ్ ఫుల్ బిజీ బిజీగా గడిపారు.
పెద్ద ఎత్తున దక్కిన అభిమానంను ఆస్వాదిస్తూ అక్కడి వాతావరణంను ా ఆస్వాదిస్తూ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు.







