మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవడం మంచిదేనా..?

మనిషి జీవితంలో ఎన్ని విషయాలు ఉన్న ఎన్ని ఆలోచనలు ఉన్న నిద్ర పోవడం అనేది చాలా అవసరం.ఈ మధ్య కాలంలో నిద్రలేమి వల్ల అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు చాలా మంది.

24 గంటల్లో కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.ఇలా ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్ర పోవడం ద్వారా మరుసటిరోజు చురుకుగా ఆరోగ్యంగా ప్రతి విషయంలోనూ పాలు పంచుకోవచ్చు.

అయితే చాలామంది రాత్రి ఎంత సమయంలో నిద్రపోయినా సరే మధ్యాహ్నం కొద్దిసేపైనా నిద్రపోకుండా అస్సలు ఉండలేరు.అది ఎలా అంటే.

వారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర వారిని పిలిచినట్టుగా ఉంటుంది.ఇకపోతే ఈ పగటిపూటనిద్ర వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతుంటారు.

Advertisement

అంతేకాదు ఈ పగటి నిద్ర వల్ల బద్ధకంగా తయారవుతారని చాలామంది చెప్పడం వింటూనే ఉంటాము.జీవితంలో ఎదగాలంటే పగటిపూటనిద్ర దూరం చేసుకోవాలని ఎందరో చెబుతుంటారు.

అయితే, ఈ విషయం కాస్త పక్కన పెడితే మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు నిద్రపోతే వారి జ్ఞాపకశక్తి చాలావరకు మెరుగు పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

కనీసం అరగంట నుంచి గంట పైన నిద్రపోతే శరీరం రిలాక్స్ గా పని ఒత్తిడి నుంచి దూరం అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే ఇందుకు సంబంధించి తాజాగా కొందరు నిపుణులు సర్వే చేయగా.

అందులో మధ్యాహ్నం పూట ఒక గంట నిద్రపోయేవారు మిగితా వారికంటే మానసికంగాను, శారీరకంగానూ, అలాగే ఆరోగ్యం పట్ల కూడా చాలా ఫిట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఇలా నిద్రపోయే వారిని, నిద్రపోని వారిని పోల్చిచూస్తే నిద్రపోని వారిలో అనేక ఆరోగ్య సమస్యలు కొత్తగా వస్తున్నట్లు తేల్చారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
చూపు లేకపోయినా 4 కిలోమీటర్లు నడిచి గ్రూప్4 జాబ్.. మానస సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

మధ్యాహ్నం పూట కాస్త నిద్ర పోవడం ద్వారా గుండె సమస్యలకు రోగాలు కూడా చాలా తక్కువగా వస్తాయని చెబుతున్నారు.ఇక మధ్యాహ్నం నిద్ర అనేది చిన్నారులకు మరింత అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement

ఇలా చేయడం వల్ల వారి మెదడు ఎదుగుదల ఎంతగానో బాగుంటుందని, తెలివితేటలు బాగా పెరుగుతాయని వారు తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు