"ఆపరేషన్ కమలం" కాంగ్రెస్ భయం !

క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్న కర్నాటక ఎన్నికల ఫలితాలు రేపు తేలిపోనున్నాయి.

పోటాపోటిగా సాగిన ఈ రసవత్తరమైన ఎన్నికల పోరులో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వంటి మూడు ప్రధాన పార్టీలు కూడా విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాయి.

అయితే ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ( Congress ) మద్యనే అనే విషయం అందరికీ తెలిసిందే.ఈ రెండు పార్టీలకు కూడా విజయం సమదూరంలో నిలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చి చెప్పాయి.

దాంతో హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉండడంతో ప్రధాన పార్టీలు అప్రమత్తం అయ్యాయి.తమ ఎమ్మేల్యేలు చేజారిపోకుండా చూసుకునేందుకు అన్నీ విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ అస్త్రశాస్త్రాలు రచించే అవకాశం ఉందని హస్తం నేతలు మొదటి నుంచి చెబుతున్నారు.ఎమ్మెల్యేలకు బీజేపీ ఏరా వేసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి కూడా గట్టిగా చెబుతోంది.అందుకే 140 సీట్లు కైవసం చేసుకొని తిరులేని విధంగా ప్రభుత్వాన్ని స్థపించాలని రాహుల్ గాంధీ( Rahul Gandhi ), మల్లికార్జున్ ఖర్గే వంటి అగ్రనేతలు పిలుపునిచ్చారు.

Advertisement

అయితే మ్యాజిక్ ఫిగర్ కూడా అందుకోవడం కష్టమే అని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడంతో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా నిలుపుకోవాలనే దానిపై కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడం బిజెపికి కొత్తేమీ కాదు.ఆయా రాష్ట్రాలలో ఇదే స్ట్రాటజీతో బీజేపీ అధికారం చేపట్టింది.దీంతో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ కు కాస్త ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండడంతో గెలిచిన ఎమ్మేల్యేలు చేజారిపోకుండా " ఆపరేషన్ కమలం " ప్లాన్ అమలు చేసేందుకు హస్తం హైకమాండ్ ప్రణాళికలు రచిస్తోందట.

పార్టీలోని ఎమ్మెల్యేలు పక్కకు వెళ్లకుండా, అలాగే బీజేపీ ( BJP )ఎమ్మెల్యేలను తమవైపు లాక్కొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే గత ఎన్నికల్లో 80 సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికి జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామికె సి‌ఎం పదవి ఇవ్వాల్సి వచ్చింది.

ఈసారి అలా కాకుండా కాంగ్రెస్ నేత నే సి‌ఎం పదవిలో ఉండే విధంగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు