Suriya : బీస్ట్ మోడ్ లో ఫ్యాన్స్ ను మాయ చేస్తున్న సూర్య.. కొత్త లుక్ భలే ఉందంటూ?

తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ స్టార్ సూర్య( Suriya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సూర్య కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.24, ఆకాశం నీ హద్దురా, 7th సెన్స్, ఆరు, ఘటికుడు, యముడు 3,యముడు ఇలా ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు హీరో సూర్య.ఇది ఇలా ఉంటే హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కంగువ.ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 Hero Suriya Workout Kanguva Latest Pic Goes Viral-TeluguStop.com

సూర్య నటిస్తున్న 42వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.పిరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం సూర్య సరి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా తన లుక్ ని మార్చుకోవడం కోసం బాగానే కష్టపడుతున్నాడు సూర్య.

తన లుక్ ని మార్చుకోవడం కోసం జిమ్ లో తెగ కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నాడు.

జిమ్ లో సూర్య వర్కౌట్స్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ఫోటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఈ సినిమాలో సూర్యకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ దిశాపటాని ( Disha Patani )నటిస్తోంది.

సూర్య బీస్ట్ మోడ్ లో కనిపిస్తూ అభిమానులను మాయ చేస్తున్నాడు.ఆ ఫోటోను చూసిన అభిమానులు లుక్కు బాగుంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube