వైసీపీ ఆవిర్భవించి దాదాపు పదేళ్లు దాటుతోంది.పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ త్వరలో ప్లీనరీని కూడా నిర్వహించబోతోంది.
వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ కోసం పని చేస్తున్న నేతలు చాలా మంది ఉన్నారు.పార్టీ కోసం పదేళ్ళుగా కష్టపడిన వారు ఎంతో మంది ఉన్నారు.
అయితే పాత వారిని సీఎం జగన్ కరివేపాకుల్లా తీసిపడేస్తున్నారని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా వైసీపీలో విశాఖ రాజకీయాలు కాక రేపుతున్నాయి.
విశాఖ సౌత్ వైసీపీలో వర్గ పోరు టాప్ లెవెల్‌లో ఉంది.టీడీపీ నుంచి రెండు సార్లు గెలిచి వైసీపీ కండువా కప్పుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాకతో వైసీపీలో వర్గ పోరు మరింత ఎక్కువగా మారింది.
వాసుపల్లి గణేష్ కుమార్ తనకంటూ ఒక వర్గాన్ని టీడీపీ నుంచి తెచ్చుకుని వారితోనే కథ నడుపుతున్నారంటూ అసలైన వైసీపీ నేతలు వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అసలు వాసుపల్లి గణేష్‌కుమార్‌ను పార్టీలోకి ఎందుకు తీసుకున్నారంటూ అధిష్టానాన్ని విశాఖ సౌత్ వైసీపీ నేతలు ప్రశ్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి.

అయితే గతంలో విశాఖ వైసీపీ రాజకీయాలను విజయసాయిరెడ్డి పర్యవేక్షించేవారు.కానీ ఇప్పుడు ఆ పగ్గాలు వైవీ సుబ్బారెడ్డి చేతుల్లోకి వెళ్లాయి.పగ్గాలు చేతులు మారినా విశాఖ సౌత్‌లో వర్గ రాజకీయాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.అయితే విజయసాయిరెడ్డి హయాంలో వైసీపీలోని పాత నేతలకు కూడా సముచిత ప్రాధాన్యత దక్కేదని.
గత ఏడాది జీవీఎంసీ ఎన్నికల్లో అసలైన వైసీపీ అభ్యర్ధులకు గణేష్ కుమార్ వర్గం టికెట్లు ఇవ్వకపోతే విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ ఇప్పించారని పలువురు గుర్తుచేస్తున్నారు.

అయితే వైవీ సుబ్బారెడ్డి వచ్చాక ఓ వర్గం మాత్రమే చలామణి అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ వర్గపోరును భరించలేక వాసుపల్లి గణేష్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాయగా అధిష్టానం బుజ్జగించిందని తెలుస్తోంది.ఈ మొత్తం ఎపిసోడ్‌లో వాసుపల్లి గెలవడంతో ఇన్నాళ్ళూ పార్టీ కోసం పని చేసిన తాము కరివేపాకులమా అంటూ వైసీపీ అధినేత జగన్‌ను వైసీపీ నేతలు నేరుగా నిలదీస్తున్నారు.