వైఎస్ వివేకా కేసులో సీబీఐ తేల్చింది శూన్యమేనా..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడే వైఎస్ వివేకానంద రెడ్డి.

 Is Cbi's Verdict Null And Void In Ys Viveka's Case?-TeluguStop.com

మార్చి 14, 15 వ మధ్య రాత్రి 2019వ సంవత్సరంలో కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో హత్యకు గురయ్యారు.

వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది.

రాష్ట్రంలో ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ క్రమంలోనే హత్యపై వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్ మరియు కుటుంబ సభ్యులు సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సీబీఐని ఏపీలో రాకుండా బహిష్కరించిన నేపథ్యంలో పిటిషన్ కోర్టుకే పరిమితం అయింది.ఒక సంవత్సర కాలం గడిచిన తరువాత మార్చి 11, 2020లో కేసును సీబీఐకి బదిలీ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఒకప్పుడు సీబీఐ అనే పేరువింటే చాలు దడ పుట్టేది.పెద్ద పెద్ద కేసులను సైతం ఇట్టే క్లియర్ చేసేదని పేరు.

ఢిల్లీ స్థాయిలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థగా పేరుగాంచిన సీబీఐ ఎంత సంక్షిష్ట కేసును అయినా చిటికెలో సాల్వ్ చేస్తుందని నమ్మకం ఉండేది ప్రజల్లో.కానీ ఇప్పుడు సీబీఐపై అప్పటి నమ్మకం లేదని తెలుస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు.వైఎస్ వివేకా హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ నాలుగేళ్లుగా ఏం తేల్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

హత్యకు సంబంధించి ఒక్క ఆధారం సేకరించలేదట.ఎక్కడో దొరికిన కాగితం ముక్కనో, ఓ చెక్క ముక్కనో పట్టుకుని అదే ఆధారం అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తుందని ప్రజలు భావిస్తున్నారని తెలుస్తోంది.

అంతేకాదు ఈ విషయాన్నే జాతీయ స్థాయిలో గుర్తంపు పొందిన ఓ ఆంగ్ల వెబ్ సైట్ పలు కోణాలలో వివరించిందని సమాచారం.

ఇన్నేళ్ల దర్యాప్తులో సీబీఐ సాధించింది జీరో అని ఆ వెబ్ సైట్ పేర్కొంది.

విచారణ అంతా ఒకే కోణంలో కొనసాగిందని, వివేకా హత్యకు వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చన్న భావన కూడా సీబీఐ అధికారులకు రాకపోవడం వింతగా ఉందంటూ వెబ్ సైట్ ప్రశ్నలు సంధించింది.ఓ వ్యక్తిని ఎంచుకున్న సీబీఐ ఆయనను నిందితుడిగా రుజువు చేసేందుకు ఆధారాలు వెతుకుతుందంటూ విమర్శలు గుప్పించిందని తెలుస్తోంది.

కాగా వాస్తవానికి కడప ఎంపీ టికెట్ కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని సీబీఐ వాదిస్తోంది.కానీ అప్పటికే కడప టికెట్ అవినాశ్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటన చేశారు.

అంతేకాదు ప్రకటన అనంతరం అవినాశ్ రెడ్డి గెలుపును కోరుతూ సాక్షాత్తు వివేకానే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.అయితే ఆ విషయాన్ని గాలికి వదిలేసిన సీబీఐ కేవలం టికెట్ కోసమే మర్డర్ అంటూ వాదిస్తోందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టికెట్ వ్యవహారంలో వివేకా, అవినాశ్ మధ్య పోటీ ఉన్నట్లు భావించిన సీబీఐ ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ ముందుకు వెళ్లింది.కానీ దానికి సంబంధించి మాత్రం ఆధారాలు సేకరించలేకపోయింది.

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ హత్యతో ప్రమేయం ఉందని చెప్పే ఆధారాలను మాత్రం న్యాయస్థానానికి చూపలేకపోయింది.అంతేకాదు అసలు అవినాశ్ రెడ్డి బలమైన అభ్యర్థి కాదని వివేకా భావించారంటూ వైఎస్ షర్మిల గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్ తో దర్యాప్తులో ముందుకు వెళ్లిన సీబీఐ అసలు అవినాశ్ రెడ్డి ట్రాక్ రికార్డ్ గుర్తించలేదని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.2014లో 1.90 వేల ఓట్ల మెజారిటీ సాధించిన అవినాశ్ రెడ్డి 2019లొ 3.80 లక్షల మెజారిటీతో గెలుపొందారు.ఆయన మెజారిటీ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అవినాశ్ రెడ్డిని వివేకా బలహీన మైన అభ్యర్థి అని ఏ విధంగా భావించారనేది ప్రశ్నార్థకం.ఈ పాయింట్ ను సీబీఐ ఎందుకు మర్చిపోయిందనేది మరో ప్రశ్న.

పోనీ షర్మిల వాంగ్మూలం ఇచ్చిందనే దానికి ఆధారం ఉందా అంటే అదీ లేదని సమాచారం.

మరోవైపు వివేకానంద రెడ్డి షమీమ్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకోవడం మొదటి భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతారెడ్డికి ఇష్టం లేదని, అందుకే ఆయనకు ఉన్న చెక్ పవర్ సైతం లాగేసుకున్నారన్నది మరో వాదన.

దీనికి బలం చేకూర్చుతూ సౌభాగ్యమ్మ సోదరులు తనను బెదిరించినట్లు షమీమ్ వెళ్లి సీబీఐ వద్ద వాంగ్మూలం ఇచ్చారు కూడా.మరి ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారించలేదు.

ఆ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చనే కోణం ఎందుకు సీబీఐ తీసుకోలేదు.హత్యకు ఏయే కారణాలు ఉండొచ్చన్న సందేహాలు సీబీఐ మదిలో మెదిలి, ఇలా పలుకోణాల్లో విచారణ జరపాల్సి ఉండగా సీబీఐ అదేమీ పట్టించుకోకుండా కేవలం ఒకే కోణంలో అది కూడా అవినాష్ కు అందులో పాత్ర ఉందన్న విషయాన్నీ నిరూపించడానికి ఎందుకు ఎక్కువ తాపత్రయ పడిందనేది అందరి మదిలోని ప్రశ్న.

ఈ తరహాలోనే పలు కీలక అంశాలను గాలికి వదిలేసిన సీబీఐ నాలుగేళ్లలో ఏం సాధించకుండా గడిపేసిందంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీన్నే ఆ ఆంగ్ల వెబ్ సైట్ సైతం ప్రశ్నించింది.

ఇన్ని సంవత్సరాల సమయం తీసుకున్న దర్యాప్తు సంస్థ సీబీఐ సరైన మార్గంలో విచారణ చేయలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube