పోలవరం గైడ్‎బండ్ నిర్మాణంలో అక్రమాలు.. దేవినేని

పోలవరం గైడ్ బండ్ నిర్మాణంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికే సీఎం జగన్ పోలవరంలో పర్యటించారని విమర్శించారు.

నాలుగేళ్లలో నాలుగు సార్లు పోలవరం పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ చివరి పర్యటనను కూడా మొక్కుబడిగా నిర్వహించారని దేవినేని ఉమ తెలిపారు.రివర్స్ టెండరింగ్ లో పోయిన డబ్బుల కోసమే పోలవరం ఎత్తు తగ్గించారన్నారు.

Irregularities In The Construction Of Polavaram Guide Bund.. Devineni-పోల�

జూలైలో వచ్చే వరదల నుంచి నిర్వాసితులను ఏ విధంగా కాపాడతారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అనంతరం పోలవరం ఎత్తు తగ్గించేందుకు సీఎం జగన్ కూడా అంగీకరించినట్లు కేసీఆర్ మాట్లాడిన వీడియోను దేవినేని ఉమ విడుదల చేశారు.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు