షారుఖ్ ఖాన్ డర్ర్ అనే సినిమాని చూసి ఉండవచ్చు, ఇందులో షారుఖ్ ఖాన్ ఒక స్త్రీ పట్ల విపరీతమైన అభిమానంతో ఆమెను, ఆమె కాబోయే భర్తను చంపడానికి ప్రయత్నిస్తాడు.ఇది భయానక కథ ఉంచుకుంటేనే మనకి భయం వేస్తుంది.
అలాంటిది ఎలాంటి పరిస్థితిని ఒక బాయ్ ఫ్రెండ్ రియల్ లైఫ్ లో ఎదుర్కొన్నాడు అతడు ఇంకా ఎంత భయపడి ఉంటాడో మనం ఊహించుకోవచ్చు.
ఐర్లాండ్‌కు( Ireland ) చెందిన జర్లాత్ రైస్( Jarlath Rice ) అనే చిత్రనిర్మాతకి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది.
అతడిని లీనా తంటాష్( Lina Tantash ) అనే మహిళ పదేళ్లుగా వేధించింది.ఆమె నుంచి తప్పించుకోవడానికి అతను వేరే దేశానికి పారిపోవాల్సి వచ్చింది.కానీ ఆమె అక్కడ కూడా అతనిని ఫాలో అయ్యింది.డబ్లిన్‌లోని ఒక కేఫ్‌కు వెళ్లిన జర్లాత్ కు లీనా తంటాష్ తొలిసారిగా కలిసింది.
ఆమె నీ పక్కన కూర్చోవచ్చా అని ఒక నోట్ రాసి అతనికి పంపించింది.అయితే మొదట ఆమె మంచిగానే ఉందని అతడు అనుకున్నాడు.
ముద్దుగా, ఫన్నీగా ఉందని భావించి ఆమెతో మాట్లాడాడు.ఆమె తన ఫోన్ నంబర్ అతనికి ఇచ్చింది.

వారు ఒక నెల పాటు డేటింగ్ చేశారు, తరువాత జర్లాత్ ఆమె నుంచి విడిపోయాడు.కానీ లీనా అతడి బ్రేకప్ ను( Breakup ) అంగీకరించలేదు.అతను వెళ్లిన ప్రతిచోటా ఆమె కనిపించడం ప్రారంభించింది.రాత్రిపూట అతని ఇంటికి కారులో వచ్చేది లేదా అతను పనికి వెళ్లేటప్పుడు అతని దారిని అడ్డుగా నిలబడేది.ఆమె అతని ఫోన్‌ను హ్యాక్ చేసి, మెసేజ్‌లు కూడా చదివింది.ఆ యువతి టార్చర్ భరించలేక అతడు తన ఫోన్ నంబర్‌ను చాలాసార్లు మార్చాడు, కానీ ఆమె అతడి నంబర్ ఎలాగోలా తెలుసుకొని అతనికి కాల్ చేసేది.
మెసేజ్ పంపిస్తూ, ఈమెయిల్ చేస్తూ ఆత్మహత్య చేసుకుంటానని తరచుగా బెదిరించేది.

ఒకరోజు, జర్లాత్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో( New Girlfriend ) కలిసి బయటకు బయలుదేరినప్పుడు, లీనా వారిపై దాడి చేసింది.అతడి ప్రియురాలిపై అరుస్తూ జర్లత్‌ను బాధించింది.అతన్ని గ్లాస్ విండోలోంచి నెట్టడానికి ప్రయత్నించింది.
జర్లాత్ ఆమె తనను చంపేస్తుందేమో అని భయపడి అక్కడినుంచి పారిపోయాడు.చివరికి ఆమె నుంచి తప్పించుకోవాలనే భావనతో యూకేకి ( UK ) మకాం మార్చాడు.
ఒక సంవత్సరం తర్వాత, ఆమె మళ్లీ అతడిని కనిపెట్టి వెంబడించడం ప్రారంభించింది.
జర్లాత్ వర్క్ ప్లేస్ కి కాల్ చేసి, జర్లాత్ చిన్నపిల్లలను లైంగికంగా వేధించే పెడోఫిల్ అని అబద్ధం చెప్పింది.
జర్లాత్ ను ఆమె అసలు వదిలిపెట్టలేదు.పదేళ్లు అతడికి చుక్కలు చూపించింది.
ఇక ఆమె వల్ల ఏం నష్టం జరుగుతుందోనని భయపడి జర్లాత్ చివరికి పోలీసులకు ఫోన్ చేయగా వారు ఆమెను అరెస్టు చేశారు.ఆమెకి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
దీని గురించి తెలుసుకుని చాలామంది షాక్ అవుతున్నారు.అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని కామెంట్లు చేస్తున్నారు.