తాలిబన్ల హస్తగతమైన ఆఫ్గానిస్థాన్ లో ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పేర్కొన్నారు.తాలిబన్ల చేతిలో ఆఫ్గాన్ ప్రజల స్థితిగతులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు ఎన్నికలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు.
తాలిబన్ల కారణంగా ఆఫ్గాన్ లో కొరవడిన శాంతిభద్రతలు ఎన్నికల ద్వారానే మళ్ళీ తిరిగి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆఫ్గాన్ ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని నిర్వహించుకునేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించుకోవాలని కోరారు.
ప్రజల అభీష్టం మేరకే ఆఫ్గాన్ లో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన అక్కడి ప్రజల శాంతిభద్రతలకు తమ దేశం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వానికి ఇరాన్ మద్దతు ఉంటుందన్నారు.
ఆఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న అనంతరం మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలిగించమని తాలిబాన్లు పేర్కొన్నారు.కానీ.
వాస్తవికంగా అక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

మహిళా స్వేచ్ఛను కాలరాస్తున్నారు.కో-ఎడ్యుకేషన్ రద్దు చేశారు.యువతులకు, పురుషులకు చదువు చెప్పకూడదని తేల్చిచెప్పారు.
అనేక మంది మహిళా ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారు.తాలిబాన్లు ఆగడాలను భరించలేక అనేక మంది మహిళలు వారికి ఎదురు తిరుగుతున్నారు.
రోడ్డుపైకి చేరి ర్యాలీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలను అడ్డుకుంటూ ఎదురు తిరిగి వారిపై దాడులకు పాల్పడుతున్నారు.