iQOO Z9 Turbo : ఐకూ Z9 టర్బో స్మార్ట్ ఫోన్ ఫీచర్లు మామూలుగా లేవుగా.. లాంచింగ్ ఎప్పుడంటే..?

ఐకూ Z9 టర్బో( iQOO Z9 Turbo ) స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు లీక్ అయ్యాయి.

ఐకూ Z9 5G స్మార్ట్ ఫోన్ కంటే Z9 టర్బో స్మార్ట్ ఫోన్ మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

అయితే ఈ స్మార్ట్ ఫోన్ విడుదలపై కంపెనీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.ఐకూ Z9 టర్బో స్మార్ట్ ఫోన్ 2712*1220 పిక్సెల్ రిజల్యూషన్ తో 1.5k డిస్ ప్లే తో ఉంటుంది.V2352A మోడల్ నంబర్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8S జెన్ 2 SoC ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది.ఈ ఐకూ Z9 టర్బో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన వివరాలు మార్చి 18న వెల్లడయ్యే అవకాశం ఉంది.

అయితే ఇటీవలే లాంచ్ అయిన ఐకూ Z9 5G స్మార్ట్ ఫోన్( iQOO Z9 5G Smartphone ) కంటే Z9 టర్బో స్మార్ట్ ఫోన్ మెరుగైన ఫీచర్లతో రానుంది కాబట్టి ఐకూ Z9 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో చూద్దాం.ఐకూ Z9 5G స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్, IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి వుంది.4nm స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 SoC చిప్ సెట్ ను కలిగి ఉంది.

Advertisement

ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పై పనిచేస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 44w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50ఎంపీ సోనీ IMX802 ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ 8GB RAM+ 128GB స్టోరేజ్, 8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు