ఒక పోలీస్ అధికారి అంటే వారికి ఒక ప్రత్యేక స్థానం,గౌరవం అనేది ఉంటుంది.అందులో ఒక ఐజీ కేడర్ లో ఉన్న ఒక అధికారి ఎంతో గౌరవంగా హుందాగా ఉంటారు.
అలాంటి ఐజీ యూనిఫామ్ లోనే సీఎం కాళ్ల కు మొక్కడం ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది.ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ ఐజీ రాజీవ్ మిశ్రా సీఎం మమతా బెనర్జీ కాళ్ల కు మొక్కారు.ఇటీవల ఒక ప్రభుత్వ కార్యక్రమం కోసం దీదీ పశ్చిమ మిద్నాపూర్ జిల్లాను సందర్శించారు.
ఈ నేపథ్యంలో బీచ్ పక్కన కుర్చీ పై కూర్చున్న దీదీ అక్కడవున్న ప్రతి ఒక్కరికీ కేకు తినిపించారు.ఈ క్రమంలో రాజీవ్ వంతు కూడా రావడం తో కేక్ తిన్న ఐజీ అనంతరం మమత పాదాలను నమస్కరించారు.
అయితే ఈ సన్నివేశాలని సంబందించిన దృశ్యాలు వీడియో లో రికార్డ్ అవ్వడం తో కొద్దీ క్షణాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియా లో ప్రత్యక్ష మైంది.దీనితో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.8 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
ఒక డ్యూటీ లో ఉన్న పోలీస్ అధికారి ఈ విధంగా సీఎం కాళ్ల కు మొక్కడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆగస్టు 21 న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారడం తో ప్రతిపక్షాలు తమదైన శైలి లో కామెంట్లు చేస్తున్నాయి.మరి వాటికి దీదీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.







