IPPB (ఇండియా పోస్ట్ పెమంట్స్ బ్యాంక్) అకౌంట్ ఉన్నవారికి ఈ విషయం తెలిసే ఉంటుంది.మొన్న జూన్ 15 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి రావడం తెలిసిందే.
AePS (ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) సర్వీస్ ఛార్జీలు జూన్ 15న అమలులోకి వచ్చాయి.నెలలో మొదటి 3 AePS ఇష్యూయర్ లావాదేవీలు పూర్తిగా ఉచితం.ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్ కోసం ప్రతీ లావాదేవీకి రూ.20 + GST చెల్లించాలి.ఇక మినీ స్టేట్మెంట్ కోసం ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.5+ GST చెల్లించాలి.ఈ ఛార్జీలతో పాటు వర్చువల్ డెబిట్ కార్డ్స్ విషయంలో కొత్త ఛార్జీలను ప్రకటించింది.
IPPB ఇకనుండి యాన్యువల్ మెయింటనెన్స్, రీ-ఇష్యూసెన్స్ ఫీజు కింద రూ.25 వసూలు చేయనుంది.కస్టమర్లు డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు IPPB వర్చువల్ డెబిట్ కార్డును రూపొందించిన సంగతి తెలిసిందే.
IPPB వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నవారికి యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు 2022 జూన్ 15 నుంచి వర్తిస్తాయి.ప్రీమియం అకౌంట్స్ ఉన్నవారికి మాత్రం ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది.
IPPB అకౌంట్ హోల్డర్స్ వర్చువల్ డెబిట్ కార్డ్ ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్ సినిమా టికెట్ల బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
దానికోసం ఇలా చేస్తే సరిపోతుంది.
IPPB యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ కావాలి.

రూపే కార్డ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత వర్చువల్ డెబిట్ కార్డ్స్ పైన క్లిక్ చేయాలి.తర్వాతి పేజీలో Request Virtual Debit Card పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అంగీకరించి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓ OTP వస్తుంది.దాంతో మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ జారీ అవుతుంది.
జనరేట్ చేసిన వర్చువల్ డెబిట్ కార్డును బ్లాక్, అన్‌బ్లాక్ కూడా చేయొచ్చు.అలాగే లావాదేవీలు ఎలా జరపాలో లిమిట్ కూడా సెట్ చేయొచ్చు.
మరెందుకాలస్యం, ట్రై చేయండి!







