మంచు విష్ణు నటుడిగా, మా అధ్యక్షుడిగా అందరికీ సుపరిచితమే.మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు విష్ణు పలు సినిమాలలో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.
ఈ క్రమంలోనే సరైన గుర్తింపు కోసం విభిన్న చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా, గాలి నాగేశ్వరరావ్ అనే సినిమాలో నటిస్తున్నారు.
తాజాగా మంచు విష్ణు జిన్నా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ పెద్దఎత్తున వివాదానికి దారి తీసింది.
ఈ విధంగా మంచు విష్ణు సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ కావడమే కాకుండా దారుణంగా నెటిజన్లు ఆయనని ట్రోలింగ్ చేస్తుంటారు.
తాజాగా మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.మంచు విష్ణు కూర్చొని దీనంగా ఆలోచిస్తున్నట్టు ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దీనిపై నేనేమీ చెయ్యాలే అని ట్యాగ్ చేస్తూ థర్స్ డే థాట్స్ అని హాష్ టాగ్ చేశారు.
ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్ యధావిధిగా మంచు విష్ణు పై కామెంట్ల వర్షం కురిపించారు.

కొందరైతే అలా ఎందుకు కూర్చుంటావు ఫాదర్ ఆఫ్ ఇండియా సినిమా తీసేయ్ అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు ముందు నువ్వు చేస్తున్న సినిమాల పై ఫోకస్ పెట్టు అంటూ కామెంట్లు చేశారు.మరికొందరైతే ఏకంగా టైంకి చేతిలో రాయి లేదు కనుక బతికి పోయావ్ బ్రో అంటూ పెద్ద ఎత్తున ఈయనపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా మంచు విష్ణు ఒక చిన్న పోస్ట్ చేసిన క్షణాలు వైరల్ అవ్వడమే కాకుండా ఇలాంటి ట్రోలింగ్ కూడా ఎదుర్కోవలసి వస్తుంది.







