మరి కొద్ది రోజుల్లోనే ఐపిఎల్ సీజన్ 17( IPL Season 17 ) ప్రారంభమవుతున్న సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్( Royal Challengers Bangalore Team ) పైన అభిమానుల నుంచి భారీ ఒత్తిడి అయితే ఎదురవుతుంది.ఇంకా ఇప్పటికే సోషల్ మీడియాలో బెంగళూరు టీం అభిమానులందరూ ‘ఈసారైనా కప్పు కొట్టి గెలిపించండి అన్నా’ అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు.
ఇక వీటిని చూస్తున్న టీం యాజమాన్యానికి అభిమానులు వాళ్ల మీద ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారో అర్థమవుతుంది.

మరి ఇలాంటి పరిస్థితిలో టీమ్ ని ముందుండి నడిపించడానికి డుప్లేసిస్ రెఢీ గా ఉన్నాడు.ఇక బెంగళూరు టీం అత్యంత బలమైన టీం గా ఈసారి బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి బెంగళూరు టీం కప్పు కొడుతుంది అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభిమానికి నిరాశ ఎదురవుతుంది.
కానీ ఈసారి మాత్రం కప్పు కొడతాం అంటూ బెంగళూరు టీం యాజమాన్యం కూడా అభిమానులకు సమాధానం చెబుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి సమయంలో టీమ్ లో డుప్లేసిస్ , కోహ్లీ, మాక్స్ వెల్ ( Duplessis, Kohli, Maxwell )ముగ్గురు ప్లేయర్లు ఎలాంటి పాత్రను పోషిస్తారు అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది.

ప్రస్తుతం టీమ్ లో ఉన్న స్టార్ ప్లేయర్లు వీళ్లు ముగ్గురే కావడం ఇక వీళ్ళకి తోడుగా ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన కెమెరన్ గ్రీన్ ( Cameron Greene )కూడా టీం లోకి రావడం ఇప్పుడు టీం యాజమాన్యానికి చాలా బలాన్ని ఇస్తుందనే చెప్పాలి.ఎందుకంటే ఈసారి కప్పు కొట్టి చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని టీమ్ బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.మరి అభిమానుల ఆశలను ఈసారని నెరవేరుస్తారా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…చూడాలి మరి ఈసారైనా వీళ్ళు కప్పు కొడతారో లేదో… ఇప్పుడు కనక బెంగుళూరు కప్పు కొట్టకపోతే మాత్రం ఇక ఆ టీమ్ అభిమానుల్లో నిరాశ మామూలుగా ఉండదు…
.






