ఐపిఎల్ మీడియా హక్కుల ధర 16,347 కోట్లు .. ఏ జట్టుకి ఎంతో తెలుసా?

దశాబ్దాలుగా క్రికెట్ అనే ఆటకు అంతర్జాతీయ క్రికెట్ తీసుకురాని పాపులారిటీని, క్రేజ్ ని తీసుకొచ్చింది ఐపిఎల్.

గత పది సంవత్సరాలలో భారత క్రికెట్ క్రికెట్ జట్టుకు ఎంతో మంది ఆటగాళ్లను అందించిన ఐపీఎల్ వందలమంది భారత ఆటగాళ్లను ఇతర దేశాల ఆటగాళ్లను కోటీశ్వరులను చేసింది.

ప్రతి ఏడాది భారత ప్రభుత్వానికి వేల కోట్ల పన్నుఅందించడమే కాదు, మనకంటూ ఓ ప్రపంచస్థాయి ఉందని చ గర్వంగా చెప్పుకునేలా చేసింది.ప్రస్తుత లెక్కల ప్రకారం ipl బ్రాండ్ వేల్యూ సుమారు 6 లియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

అంటే సుమారు 39 వేల కోట్లు.చూశారా పదేళ్లలో ఐపిఎల్ ఎక్కడికి వెళ్ళిపోయిందో‌.

ఇక ఐపియల్ మీడియా రైట్స్ కోసం నిన్న బిడ్డింగ్ జరిగింది.స్టార్ ఇండియా ఏకంగా 16,347.50 కోట్లులతో (దాదాపుగా 2.5 బిలియన్ డాలర్లు) బిడ్ వేసి ఐదేళ్ళపాటు ఐపియల్ మ్యాచుల ప్రాసర హక్కులని చేజిక్కించుకుంది.గత పదేళ్ళ ప్రసారాలకి సోని వారు 8,200 కోట్లు చెల్లిస్తే, ఈ ఐదెళ్ళకే ఆ ఎమౌంట్ డబుల్ కావడం విశేషం.

Advertisement

ఈ డీల్ లో ఇటు టీవి హక్కులతో పాటు, అనలైన్ స్ట్రీమింగ్ హక్కులు ఉంటాయి.ఓసారి ఈ కింది లెక్కలను చూడండి, STAR INDIA ఐపియల్ మీద డబ్బులు ఎలా వెచ్చిస్తోందో.మొత్తం : 16,347.50 కోట్లు ఏడాదికి చెల్లించేది : 3269.50 కోట్లు ఒక్క మ్యాచుకి చెల్లించేది : 54.49 కోట్లు ఒక్క ఓవర్ కి - 1.35 కోట్లు ఒక్క బాల్ కి - 22.50 లక్షలు ఆశ్చర్యపోతున్నారా? ఒక్కో బాల్ కి 22.50 లక్షలు అంటే మాటలా? మరి ఇందులో బిసిసిఐకి అందే మొత్తం ఎంత? 8 ఐపియల్ జట్లకు అందేది ఎంత? అన్ని జట్లు సమానంగా పంచుకుంటాయా? లేక ఎక్కువ బ్రాండ్ వాల్యూ కలిగిన ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి జట్లు సింహభాగాన్ని అందుకుంటాయా? ఇవే కదా మీ అనుమానాలు? ఈ 16,347.50 కోట్లలో బోర్టుకి అందేది 40% అయితే, 8 జట్లు పంచుకునేది 60%.అంటే ఒక్కో జట్టుకి 1,226.06 కోట్లు అందుతాయి అన్నమాట.ఇందులో చిన్న టీమ్, పెద్ద టీమ్ అనే తేడాలుండవు.

అన్ని జట్లకి సమానమైన వాటా ఉంటుంది‌.

Advertisement

తాజా వార్తలు