IPL 23: కొత్త రూల్స్ షురూ… కదిలితే మూల్యం చెల్లించుకోవలసిందే!

ఐపీఎల్( IPL ) 16వ సీజన్ రెండు నెలల పాటు… అంటే మార్చి 31 నుంచి మే 28 వరకు క్రికెట్ అభిమానులను ఉర్రుతలూగించనుంది.ఈసారి ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగనుందని క్రికెట్ ( Cricket )పండితులు చెబుతున్నారు.

 Ipl 23 New Rules If You Move You Will Have To Pay The Price-TeluguStop.com

అవును, జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్( Indian Premier League ) 2023 సీజన్ రెడీ అయిపోయింది కాబట్టి మీరు కూడా సిద్ధపడండి.మరో వారం రోజుల్లో మెరుపుల క్రికెట్ లీగ్ ఘనంగా ఆరంభం కానుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఈసారి ఐపీఎల్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ నిబంధనతో ప్లేయింగ్ ఎలెవెన్ లో లేని ప్లేయర్ ను తుది జట్టులో వాడుకోవచ్చు.దాంతో మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది.ఈ రూల్ తో పాటు మరికొన్ని నిబంధనలు కూడా ఉండబోతున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ ఇన్ఫో తన కథనంలో చెప్పుకొచ్చింది.

ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌‌ను ప్రవేశపెట్టడంతో పాటు టీమ్స్ రివ్యూల సంఖ్యను కూడా పెంచేసింది.వైడ్, నోబాల్‌లకు కూడా రివ్యూలు తీసుకునే అవకాశం కల్పించింది.ఈసారి ఐపీఎల్ ల్లో మాత్రం టాస్ తర్వాత తుది జట్టును ఖరారు చేయనున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండు జట్లు టాస్ వేసిన తర్వాత తమ తుది జట్లను ప్రకటించేలా కొత్త రూల్ ఒకదానిని తీసుకొచ్చింది.ఈ నిబంధనతో టాస్ నిర్ణయాన్ని బట్టి తుది జట్టును, ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆయా జట్లు ఎంపిక చేసుకొనే వీలుంది.ఈ టాస్ రూల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న స్లో ఓవరేట్ పెనాల్టీ రూల్‌ కూడా ఇక్కడ అమలు కానుంది.

ఇక నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకుంటే మాత్రం సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తున్నారు.ఎన్ని ఓవర్లు తక్కువైతే.అన్ని ఓవర్ల పాటు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube