IPL 22: వారు సూపర్ బౌలర్లు.. కానీ సొంత జట్టుకి వాళ్ళు విలన్లు అయ్యారు?

MI (ముంబై ఇండియన్స్) vs KKR (కోల్‌కతా నైట్ రైడర్స్) మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ ప్రేమికులు అందరూ చూసే వుంటారు.ఈ మ్యాచ్ లో సామ్స్ వేసిన ఓ ఓవర్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ అని చెప్పుకోవచ్చు.

 Ipl 22 They Are Super Bowlers But Have They Become Villains For Their Own Team-TeluguStop.com

ఎందుకంటే, డానియల్ సామ్స్ వేసిన ఒక ఓవర్‌లో పాట్ కమిన్స్ 35 పరుగులు సాధించాడు కాబట్టి.ఒక ఓవర్లో 30 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు.

IPL చరిత్ర చూసుకుంటే ఇలాంటి సంఘటనలు చాలానే ఉంటాయి.అత్యధిక పరుగులు చేసిన బౌలర్లను ఓసారి ఇక్కడ చూద్దాం.

RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)కి చెందిన హర్షల్ పటేల్ 1 ఓవర్లో 37 పరుగులు ఇచ్చి తన బ్యాచ్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు.కాగా ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది.

ఈ మ్యాచ్‌లో.చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా హర్షల్ పటేల్ వేసిన 1 ఓవర్లో 37 పరుగులు లంకించి, రికార్డ్ సాధించాడు.

అలాగే 2011 IPLలో, కొచ్చి టస్కర్స్ కేరళ ఫాస్ట్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ ఒక ఓవర్లో 37 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కొచ్చి టస్కర్స్ కేరళ జట్ల మధ్య జరిగింది.

ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఈ ఓవర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్లలో ఒకటిగా నిలిచింది.

Telugu Daniel Sams, Harshal Patel, Latest-Latest News - Telugu

అలాగే MI (ముంబై ఇండియన్స్)తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ డేనియల్ సామ్స్ వేసిన ఒక ఓవర్లో KKR (కోల్‌కతా నైట్ రైడర్స్) బ్యాట్స్‌మెన్ పాట్ కమిన్స్ 35 పరుగులు సాధించాడు.ఈ విధంగా, 1 ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇవ్వడంలో సామ్స్ 3 స్థానంలో నిలిచాడు కమిన్స్.ఇక 2014 సంవత్సరంలో, PBKS (పంజాబ్ కింగ్స్) బౌలర్ పర్వీందర్ అవానా 1 ఓవర్లో 33 పరుగులు సమర్పించుకున్నాడు.

అలాగే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ రవి బొపారా పేరు కూడా ఉంది.బొపారా వేసిన ఒక ఓవర్‌లో 33 పరుగులు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube