ఒకప్పుడు పుస్తకం చదవాలంటే గ్రంథాలయాల్లోనో, లేక పుస్తకాల షాపుకు పోయి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేసి చదవాల్సిందే.ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ రావడంతో బుక్ ఆర్డర్ చేస్తే ఇంటికే పుస్తకం రావడం జరిగింది.
తర్వాత తర్వాత అమెజాన్ నుంచి ఈ-బుక్స్ ని కొనుగోలు చేసి డైరెక్ట్ గా ఫోన్ లోనే చదవడం మొదలయింది.అయితే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ న్యూస్ తెలిపింది.ఇకపై ఆండ్రాయిడ్ యాప్ యూజర్లు అమెజాన్ నుంచి ఈ-బుక్స్ కొనుగోలు చేయడం కుదరదని ప్రకటించింది.
ఈ ఏడాది జూన్ 1 నుంచి గూగుల్ బిల్లింగ్ పాలసీలో మార్పులు చేయనుంది.ఈ మార్పులకు అనుగుణంగా ఉండేందుకు అమెజాన్ కంపెనీ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ-బుక్స్ (Kindled Books) కొనుగోలు చేసే ఫెసిలిటీని తొలగించింది.
దీంతో ఇకపై ఆండ్రాయిడ్ యాప్, ఈ-రీడర్ వంటి ఆండ్రాయిడ్ డివైజ్‌ల ద్వారా ఈ-బుక్స్ కొనుగోలు చేయడం సాధ్యం కాదు.అన్ని ప్లే స్టోర్ యాప్స్ తమ సొంత బిల్లింగ్ సిస్టమ్ కాకుండా ప్లే స్టోర్ బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించాలని గూగుల్ కోరుకుంటోంది.
లేనిపక్షంలో ప్లేస్ స్టోర్ నుంచి ఆ యాప్స్‌ను తొలగిస్తామని చెప్పింది.అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణం.

గూగుల్ బిల్డింగ్ సిస్టమ్ పై కాకుండా ఎక్స్‌టర్నల్ ప్లాట్‌ఫామ్‌లపై యూజర్లు చేసే ట్రాన్సాక్షన్ల కోసం గూగుల్ కొంత కమిషన్ తీసుకుంటుంది.ఒకవేళ గూగుల్ బిల్లింగ్ సిస్టమ్‌కు బదులుగా యాప్ డెవలపర్లు తమ సొంత బిల్డింగ్ సిస్టమ్ ఉపయోగిస్తే గూగుల్ కి వారు కమీషన్ చెల్లించుకోవాల్సి వస్తుంది.ఈ నిర్దిష్ట కమీషన్ చెల్లించకూడదనే ఉద్దేశంతో అమెజాన్ తన ఆండ్రాయిడ్ యాప్ నుంచి ఈ-బుక్స్ కొనుగోళ్లను నిలిపివేసింది.మీరు అమెజాన్ ద్వారా పుస్తకాలను చదవడానికి ఫోన్, ఈ-రీడర్ వంటి ఆండ్రాయిడ్ డివైజ్ ఉపయోగిస్తుంటే, ఇప్పటి నుంచి అది సాధ్యం కాదు.







