ప్రస్తుతం ఆర్సీబీ టీం( RCB Team ) తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది ఇక ఇప్పటికే ఈ టీమ్ మీద అభిమానులు భారీ అంచనాలను పెట్టుకొని ప్రతిసారి నిరాశపడుతున్నారు.కానీ ఈసారి మాత్రం కప్పు కొట్టకపోతే ఆర్సిబి టీం చాలా దారుణమైన ట్రోలింగ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ సీనియర్ క్రికెటర్లు( Senior Cricketers) సైతం ఈ టీమ్ పైన వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే 17.5 కోట్ల తో కొనుగోలు చేసిన కెమరాన్ గ్రీన్( Cameron Green ) ఈసారి ఎలాంటి ప్రతిభను కనబరుస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ముఖ్యంగా ఆల్ రౌండర్ గా తను ఒక్కడు సక్సెస్ అయితే ఈసారి అర్సిబి ఈజీగా కప్పు కొట్టగలుగుతుంది అని చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే గత ఏడాది ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఆడిన గ్రీన్ ఆయన పెద్దగా పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు.ఇప్పుడు ఆర్సిబి టీం తరఫున ఎలాంటి ప్రతిభను చూపిస్తాడుఆ టీమ్ ని ఎలా గెలిపిస్తాడు అనేది కీలకంగా మారింది.ఇక ఈ టీం లో దిగ్గేజ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ( Virat Kohli ), గ్లేన్ మాక్స్ వెల్, ఫాఫ్ డూప్లేసిస్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ గ్రీన్ ఈ సీజన్ లో ఆర్సిబికి చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.
తను తలచుకుంటే అటు బ్యాటింగ్ లోను( Batting ), ఇటు బౌలింగ్ లో రెండిట్లోనూ సత్తా చాటుతూ టీమ్ కు అయితే విజయాన్ని అందించే సత్తా ఉన్న ప్లేయర్ కావడంతో ముంబై యాజమాన్యం( Mumbai team ) అతని మీద చాలా అంచనాలైతే పెట్టుకుంది.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యం తో ఆర్సిబీ టీమ్ భారీ కసరత్తులు అయితే చేస్తుంది…