ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) వర్సెస్ గుజరాత్ టైటాన్స్( Gujarat Titans ) టీమ్ లా మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది.అయితే ఈ రెండు టీమ్ లు ఇంతకుముందు తలపడినప్పుడు గుజరాత్ టైటాన్స్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విక్టరీని సాధించింది.
ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే గుజరాత్ టైటాన్స్ మాత్రం వరుస ఓటమితో సతమతమవుతుంది.
కాబట్టి వాళ్లు కూడా ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లో గెలిచి వాళ్ళ ప్రతిభను చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక గుజరాత్ లో శుభ్ మన్ గిల్,( Shubman Gill ) డేవిడ్ మిల్లర్,( David Miller ) రషీద్ ఖాన్( Rashid Khan ) లాంటి ప్లేయర్లు ఈ టీం లో అద్భుతమైన ఉన్నప్పటికీ వీళ్ళు మంచి పర్ఫామెన్స్ ని ఇవ్వడంలో కొంత వరకు తడబడుతుంది.ఇక ఢిల్లీ క్యాపిటల్స్ లో అయితే చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు.అయినప్పటికీ వాళ్లు కూడా ఏ మాత్రం ప్రతిభను చూపించలేకపోతున్నారు.
ఇక ఈ రెండు టీమ్ లు కూడా పాయింట్స్ టేబుల్ లో చివరి ప్లేస్ లో ఉండడం నిజంగా అభిమానులకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి.
మరి ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచి మరోసారి తమ అధిపత్యాన్ని చూపించుకుంటుందా లేదా మొన్న ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ గెలిచి తమ సత్తా చాటుతుందా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ మ్యాచ్ మీద చాలా మంది ప్లేయర్లు చాలా ఆశలైతే పెట్టుకున్నారు.మరి ఆ ఆశలను నెరవేరుస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే ఈ మ్యాచ్ లో ఈ రెండు టీములు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి…చూడాలి మరి వీటిలో ఏ టీమ్ విజయాన్ని సాధిస్తుంది అనేది…