ఐపీఎల్ లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పంజాబ్ మీద దారుణంగా ఓడిపోయింది.ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 174 పరుగులు చేసింది.
అయితే బ్యాటింగ్ లో రానించిన ఢిల్లీ టీమ్( Delhi Team ) బౌలింగ్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.దాని వల్లే ఈ టీం చాలా వీక్ గా కనిపించినట్టుగా అనిపించింది.
ఢిల్లీ టీమ్ లో బౌలర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కొంతవరకు బౌలింగ్ బాగా వేసినప్పటికీ మిచెల్ మార్ష్,( Mitchell Marsh ) ఇషాంత్ శర్మ( Ishant Sharma ) లాంటి వాళ్ళు మాత్రం తేలిపోయారు.
ఈసారి రిషబ్ పంత్( Rishabh Pant ) కెప్టెన్సీలో వరుస విజయాలను అందుకుంటుందని అందరు అనుకున్నారు.కానీ అనుకోని రీతిలో మొదటి మ్యాచ్ లోనే ఈ టీమ్ భారీగా ఢీలా పడిందనే చెప్పాలి.ఇంకా ఇప్పుడు ఈ మ్యాచ్ లో జరిగిన ఫెయిల్యూర్స్ ని తెలుసుకొని మరోసారి పునరావృతం చేయకపోతే మాత్రమే ఢిల్లీ టీమ్ ఐపీఎల్( IPL ) పూర్తి సీజన్ లో కొనసాగుతుంది.
లేకపోతే మాత్రం ఈ టీమ్ సెమీ ఫైనల్ కి వెళ్లడం కష్టం అనే చెప్పాలి.ఇక ఈసారి కనుక ఢిల్లీ టీం సెమీఫైనల్ కు చేరాలంటే మాత్రం ఇక జరగబోయే మ్యాచ్ లో 11 మంది ప్లేయర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తే తప్ప వాళ్లు మాత్రం గెలవ లేరు.
ఇక ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ఢిల్లీ టీమ్ తప్పకుండా విజయం సాధించాలి అంటే మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో సత్తా చాటకపోతే మాత్రం ఢిల్లీ టీం ఈసారి కూడా కప్పు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే…ఇక ఇది ఇలా ఉంటే ఈ టీమ్ లో చాలా మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఫామ్ లో లేరు వాళ్ళు కనక ఫామ్ లోకి వస్తేనే ఈ మ్యాచ్ లు గెలవడానికి అవకాశం ఉంటుంది…
.