Apple iPhone 16 : ఆన్ లైన్ లో లీక్ అయిన ఐఫోన్ 16 సీరీస్ ఫీచర్లు మామూలుగా లేవుగా..!

ఐఫోన్ 15( Apple iPhone 16 ) లో ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు ఉంటాయో దాదాపు అందరికీ తెలిసిందే.

అదే ఐఫోన్ 16 అయితే ఫీచర్లు ఇంకెంత మెరుగుగా ఉంటాయో.

ఈ ఐ ఫోన్ 16 లాంచ్ అయ్యేందుకు ఇంకొన్ని నెలల సమయం ఉండగానే.తాజాగా ఆన్ లైన్ లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ డిజైన్ తో పాటు ఫీచర్ వివరాలు లీక్ అయ్యాయి.

అవి ఏమిటో తెలుసుకుందాం.

ఆన్ లైన్ లో లీక్ అయిన సమచారం ప్రకారం.ఐఫోన్16 ప్రో స్మార్ట్ ఫోన్ 6.27 అంగుళాల డిస్ ప్లే, ఐఫోన్16 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 6.86 అంగుళాల డిస్ ప్లే తో ఉండనుంది.ఐఫోన్15 తో పోలిస్తే ఐఫోన్16 ఫోన్ డిజైన్ మెరుగుగా ఉండే అవకాశం ఉంది.వర్టికల్ కెమెరా లేఅవుట్ తో రానుంది.

Advertisement

స్పేషియల్ వీడియో రికార్డింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

ఇక ఐఫోన్16, ఐఫోన్16 ప్రో మ్యాక్స్ మోడళ్ల బ్యాటరీ మెరుగైన సామర్థ్యాలతో ఉండే అవకాశం ఉంది.అయితే ఐఫోన్ 16 ప్లస్ బ్యాటరీ సైజు మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉంది.మొత్తానికి ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ అధునాతన బ్యాటరీ టెక్నాలజీతో ఉండనుంది.

ఈ సిరీస్ A18 ప్రో చిప్( A18 Pro chip ) ను కలిగి ఉంటుంది.ఈ చిప్ స్మార్ట్ ఫోన్ పనితీరును మెరుగు పరుస్తుంది.అంతే కాదు iOS 18లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) ఆధారిత సామర్థ్యాలను ఇంటిగ్రేట్ చేస్తుంది.

అప్గ్రేటెడ్ సిరీస్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ కంటెంట్ క్రియేషన్ టూల్స్ ను కలిగి ఉంటుంది.వీటితోపాటు ఆపిల్ సంస్థ( Apple company ) ఫోల్డబుల్ ఐఫోన్ లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

అయితే ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయని వివరాలు సంస్థ ఇంకా వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు