చంద్రబాబు కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి మరో రెండు కేసులు ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణకు రానున్నాయి.

అటు ఫైబర్ గ్రిడ్ కేసు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది.

ఈ మేరకు ఇవాళ చంద్రబాబు మూడు కేసులపై రెండు కోర్టుల్లో విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ ను పొందిన సంగతి తెలిసిందే.

కాగా హైకోర్టులో విచారణకు వచ్చే కేసులలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసుతో పాటు మద్యం కంపెనీలకు లైసెన్స్ కేసు ఉన్నాయి.ఈ రెండు కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా? లేదా ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు