ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.
ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.నాలుగు వారాలు గడుస్తున్న ఎందుకు కౌంటర్ వేయలేదని కోర్టు ప్రశ్నించింది.
దీనిపై మరో రెండు వారాల సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది.అనంతరం ఇప్పటికే పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారణ పూర్తయిందన్న ప్రభుత్వం.
బోర్డు నిర్ణయం పెండింగ్ లో ఉందని వెల్లడించింది.ఈ క్రమంలో ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాజాసింగ్ పై వందకు పైగా పీడీ యాక్ట్ కేసులు నమోదు కావడంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.