హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో నిందితుడు హరిహర కృష్ణను పోలీసులు ఐదవ రోజు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
ఫిబ్రవరి 17న నవీన్ ను హత్య చేసిన హరిహర కృష్ణ 24వ తేదీన పోలీసుల ఎదుట లొంగిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.అయితే తన ప్రియురాలు కోసమే హత్య చేసినట్లు నిందితుడు పోలీస్ కస్టడీలో తెలిపాడు.
ఈ నేపథ్యంలో ప్రియురాలు నిహారికతో పాటు నిందితుడి స్నేహితుడు హసన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా ఈ కేసులో ఏ1 గా హరిహర కృష్ణ, ఏ2 గా హసన్, ఏ3గా నిహారికగా చేర్చారు.
ఇద్దరు నిందితులకు హయత్నగర్ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.దీంతో నిహారికను చంచల్ గూడ జైలుకు, హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.