నిజాయితీగా నైతిక విలువలకు కట్టుబడి బీజేపీలో చేరుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని మరోసారి స్పష్టం చేశారు.
రాజీనామా తర్వాత మునుగోడులో వస్తున్న మార్పులను ప్రజలు గ్రహించాలన్నారు.
బీజేపీకి అమ్ముడుపోయానంటూ తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో టీఆర్ఎస్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా పోలేదని తెలిపారు.రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన పోవాలనే పార్టీ మారుతున్నానని వెల్లడించారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడిందని వ్యాఖ్యనించారు.







