రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, గ్యాస్, కరెంట్ చార్జిలు పెంపుపై దృష్టి పెట్టారని మండిపడ్డారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేసి ప్రజలు మోసపోయారని అన్నారు.
తుఫాన్లు నష్ట పరిహారం క్రింద 4వేల కోట్లు ఇస్తాను అని చెప్పి, ఎంత ఖర్చు చేసాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల నెత్తిన అప్పులు తెచ్చి పెట్టారని అయ్యన్న ధ్వజమెత్తారు.







