టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఒక కొనసాగుతున్నటువంటి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ( Mokshagna ) ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
గత 5 సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి ప్రకటనలు వెలబడలేదు.
ఇకపోతే ఈ ఏడాది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పక్క ఉంటుందని బాలయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో బాలయ్య ఉన్నారు.ఈ ఎన్నికలు కాస్త పూర్తి అయిన వెంటనే తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే పనులలో బాలయ్య బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.
ఇక మోక్షజ్ఞను బోయపాటి శ్రీను ( Boyapati Sreenu ) ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని వార్తలు కూడా ఇటీవల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
బోయపాటి అంటేనే మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.ఈ క్రమంలోనే మోక్షజ్ఞ అని కూడా ఒక యాక్షన్ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.అయితే బోయపాటి గతంలో అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసుకున్నటువంటి స్క్రిప్ట్ ను మోక్షజ్ఞకు ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ వరుస సినిమాలకు కమిట్ అవ్వడంతో ఇప్పుడప్పుడే బోయపాటికి డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవు.దీంతో అల్లు అర్జున్ ( Allu Arjun ) కోసం సిద్ధం చేసుకున్న కథతో మోక్షజ్ఞతో సినిమా చేయాలని భావిస్తున్నారు.
అయితే ఈ విషయం తెలిసి పలువురు బాలయ్య చాలా రిస్కు చేస్తున్నారేమోనని భావిస్తున్నారు.అల్లు అర్జున్ కి అనుగుణంగా సిద్ధం చేసుకున్న కథ మోక్షజ్ఞకు సెట్ అవుతుందా మొదటి సినిమాకే బాలయ్య ఇలాంటి రిస్క్ చేయడం అవసరమా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.