అప్పన్న దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు

దేశంలోనే రెండు అవతారాల గల సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంకి తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఈమేరకు " ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండరైజేషన్ " 9001-2015 సర్టిఫికెట్ ను సదరు సంస్థ నిర్వాహకులు అందజేశారు.

  భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, ఉద్యోగాల నాణ్యమైన సేవలు, పరిశుభ్రత, పచ్చదనం వంటి ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని అవార్డును సదరు సంస్థ అందజేసింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్నా అప్పన్న భక్తులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు హిందూ ధర్మాన్ని, సంస్కృతిని సింహాచలం దేవస్థానం క్రమం తప్పకుండా పాటిస్తుందని సదరు సర్టిఫికెట్ల పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి శనివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆలయ ఈవో ఎం.వి సూర్యకళలు ఈఐఎస్ఓ సర్టిఫికెట్ వివరాలను పాత్రికేయులకు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈఐఎస్ఓ సర్టిఫికెట్ రావడానికి కృషి చేసిన దేవస్థానం ఈవో తో పాటు సిబ్బంది అభినందనలు తెలియజేస్తున్నమన్నారు.దేవస్థానం నిర్వహించే నాణ్యత ప్రమాణాలు ఆధారంగా ఈ సర్టిఫికేట్ చేస్తారన్నారు.సింహగిరిపై భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారని ఇప్పటికే కేంద్రం ప్రసాదం స్కీమ్ అమలు కోసం రూ.54 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు.అయా నిధులతో పలుఅభివృద్ధి పనులు చేపడతామన్నారు.

Advertisement

కరోనా  వల్ల ఆలయ పనులు కొంత ఆలస్యంగా జరిగిందన్నారు.ఆలయ ఈవో ఎం.వి సూర్యకళ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా దేవస్థానం ఉద్యోగులు అందిస్తున్న నాణ్యమైన సేవలు గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వచ్చామన్నారు.దీంతో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోగలిగారు అన్నారు ప్రస్తుతం ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిటింగ్ దేవస్థానంలో జరుగుతుందని త్వరలోనే ఆ రంగంలో కూడా ఐఎస్ఓ సర్టిఫికెట్ లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లు ఈవో సూర్యకళ చెప్పారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు